రవితేజ.. 'అక్కాయిలు బాగున్నారా?
ABN , Publish Date - Apr 27 , 2026 | 06:39 PM
మాస్ మహారాజా ఈ మధ్య రూట్ మారుస్తున్నాడు. మాస్ నుంచి క్లాస్‌కు మైగ్రేట్ అవుతున్నాడు. ఇటీవల కాలంలో ఆయన చేస్తున్న సినిమాలు, వాటి టైటిల్స్ ఆసక్తికరంగా ఉంటున్నాయి.
మాస్ మహారాజా రవితేజ కొత్త ప్రయోగాలకు రెడీ అవుతున్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్లపై మనసు పారేసుకుంటున్నాడు. ఇటీవలే 'భర్త మహాశయులకు విజ్ణప్తి' అంటూ కొత్త ప్రయోగం చేసిన మాసోడు.. అప్ కమింగ్ మూవీ విషయంలోనూ అదే ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో నిర్మాత దిల్ రాజుతో చేయబోయే సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ను పెట్టబోతున్నారట.
యంగ్ డైరెక్టర్ హసిత్ గోలి ఈ సినిమాను తెరకెక్కించబోన్నాడు. 'రాజా రాజా చోర' వంటి హిట్ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న హసిత్.. రవితేజ మాస్ స్టైల్‌కు సరిపడా పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట. అంతేకాదు.. ఈ మూవీకి ఓ క్రేజీ టైటిల్‌ను కూడా అనుకుంటున్నాడట. సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్న ఆ టైటిల్ ఏమిటంటే.. 'అక్కాయిలు బాగున్నారా?'. ఈ పేరు విన్నవారంతా ఆశ్చర్యపోతున్నారు.
ఈ మధ్య కాలంలో డిఫరెంట్ మాస్ టైటిల్స్‌తో వస్తున్నాడు రవితేజ. కానీ ఏదీ కూడా పెద్దగా వర్కవుట్ కావడం లేదు. దీంతో ఈ సారి కాస్త క్లాసీ ఫీల్‌తో పాటు ఫ్యామిలీ టచ్ ఉన్న టైటిల్‌తో రావాలని టీమ్ భావిస్తోందట. 'అక్కాయిలు బాగున్నారా?' అనే టైటిల్ ఆ దిశగా ఒక ఆసక్తికరమైన ప్రయత్నం అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఇరుముడి' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న రవితేజ, ఆ చిత్రం పూర్తి కాగానే ఈ కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్టోరీ లాక్ అయ్యిందని తెలుస్తోంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి . 'రాజా ది గ్రేట్' తర్వాత వస్తున్న రవితేజ - దిల్ రాజు కాంబినేషన్ లోని ఈ మూవీ ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తుందో చూడాలి.
Read Also: వార్నీ..'పెద్ది' వాయిదాకు కారణం ఇదా?
Read Also: Mahesh Babu: మూడేళ్లు గ్యాప్.. వచ్చే మూడేళ్లు పండగే..