Mahesh Babu: మూడేళ్లు గ్యాప్‌.. వచ్చే మూడేళ్లు పండగే..

ABN , Publish Date - Apr 27 , 2026 | 03:06 PM

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు (mahesh Babu) గత చిత్రం ‘గుంటూరు కారం’ విడుదలై రెండేళ్లు దాటేసింది. తాజాగా చిత్రం ‘వారణాసి’ రావాలంటే ఇంకా ఏడాది సమయం ఉంది.

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు (mahesh Babu) గత చిత్రం ‘గుంటూరు కారం’ విడుదలై రెండేళ్లు దాటేసింది. తాజాగా చిత్రం ‘వారణాసి’ రావాలంటే ఇంకా ఏడాది సమయం ఉంది. రాజమౌళి (Rajamouli)దర్శకత్వంలో భారీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు మహే్‌ష్‌ పూర్తి స్థాయి పాన్‌ ఇండియా సినిమా చేయలేదు. ఇదే తొలి ప్రయత్నం. ఈ సినిమాతో మహేశ్‌ గ్లోబల్‌స్థాయిలో గుర్తింపు పొందే అవకాశాలున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఆయన కెరీర్‌కు ఇది గేమ్‌ ఛేంజర్‌గా మారనుంది. అయితే ఈ సినిమా పూర్తయ్యాక మహేశ్‌కు పెద్ద లైనప్‌ ఉంది. ‘వారణాసి’ షూటింగ్‌ పూర్తి కావడంతోనే ఇతర ప్రాజెక్ట్‌లతో దృష్టి పెట్టనున్నారు మహేశ్‌. ఆయన తదుపరి చిత్రం మైత్రీ మూవీ మేకర్స్‌లో ఉండబోతుందని టాక్‌. అయితే ఈ చిత్రానికి దర్శకుడు ఇంకా ఫైనల్‌ కాలేదు, చర్చల దశలో ఉంది.

అలాగే ఏషియన్‌ సునీల్‌తో కూడా ఓ సినిమా కమిట్‌మెంట్‌ ఉంది. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి. వారణాసి విడుదల తర్వాత వచ్చే మూడేళ్లు మూడు సినిమాలు విడుదల చేయాలని మహేశ్‌ ప్లాన్‌లో ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపారు.

Updated Date - Apr 27 , 2026 | 04:25 PM