సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఇరుముడి.. అక్కినేని హీరో వలన అయ్యేదా

ABN, Publish Date - Aug 22 , 2026 | 08:38 PM

సాధారణంగా ఇండస్ట్రీలో ఏ హీరో ఏ సినిమా చేయాలి అనేది రాసిపెట్టి ఉంటుంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఒక కథ ఒక హీరో కోసం రాసి.. ఆ హీరోతోనే చేయడం అనేది చాలా రేర్ గా జరుగుతుంది.

Irumudi

సాధారణంగా ఇండస్ట్రీలో ఏ హీరో ఏ సినిమా చేయాలి అనేది రాసిపెట్టి ఉంటుంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఒక కథ ఒక హీరో కోసం రాసి.. ఆ హీరోతోనే చేయడం అనేది చాలా రేర్ గా జరుగుతుంది. ఒక కథ చాలామంది హీరోల వద్దకు వెళ్లి.. చివరకు ఓకే హీరో వద్దకు చేరి అది హిట్ అయితే.. అరెరే మిగతా హీరోలు ఇంతమంచి కథను ఎలా మిస్ చేసుకున్నారు అని అనుకోకుండా ఉండలేరు ప్రేక్షకులు. తాజాగా మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం ఇరుముడి (Irumudi) బాక్సాఫీస్ మంచి వసూళ్లను రాబడుతోంది. నాలుగేళ్ల తరువాత రవితేజ ఇలాంటి మంచి హిట్ ను అందుకున్నాడు. కంటెంట్ నచ్చితే ప్రేక్షకులు సినిమాను నెత్తిన పెట్టుకుంటారని ఇరుముడి మరోసారి రుజువు చేసింది. కేవలం రెండు రోజులోనే ఇరుముడి బ్రేక్ ఈవెన్ సాధించి రికార్డులు సృష్టించింది.


అయితే అందుతున్న సమాచారం ప్రకారం..ఇరుముడి కథను మొదట శివ నిర్వాణ.. అక్కినేని హీరో నాగ చైతన్యకు వినిపించడట. కథ నచ్చినప్పటికీ, తన తదుపరి చిత్రం వృషకర్మ కు ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడంతో చైతూ ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. దీంతో ఇప్పుడు ఇరుముడి కథ హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ ఈ సినిమాలో త్రినాథ్ పాత్రను నాగ చైతన్య చేసి ఉంటే అంతగా సెట్ అయ్యేది కాదేమోనని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మధ్యవయస్సు దాటిన తండ్రి పాత్ర, పదేళ్ల పాపకు తండ్రిగా నటించడం అంటే మామూలు విషయం కాదు.


ప్రస్తుతం చై వయస్సు 39. ఈ వయస్సులోనే పదేళ్ల పాపకు తండ్రిగా కనిపించినా.. ఆయన ఎక్స్ప్రెషన్స్ లో అంతా పరిణితి కనిపించేది కాదేమో అని అంటున్నారు. తాగుబోతుగా మజిలీలో కనిపించినా.. మిగతా విషయాల్లో రవితేజ అంతా నటన కనబరచలేకపోయేవాడని, చై ఈ కథను రిజెక్ట్ చేయడమే మంచిది అయ్యిందని చెప్పుకొస్తున్నారు. త్రినాథ్ గా రవితేజ పర్ఫెక్ట్ ఛాయిస్ అని, వయస్సుకు తగ్గ పాత్రతో పాటు.. తండ్రిగా ఆయన నటించడం కన్నా జీవించేశాడని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా ఇరుముడి.. రవితేజకుదక్కాలని ఆ అయ్యప్ప ఎప్పుడో రాసిపెట్టి ఉంచాడని కొందరు చెప్పుకొస్తున్నారు

Updated Date - Aug 22 , 2026 | 08:38 PM