Raviteja: రవితేజ నెక్ట్స్ మూవీలో హీరోయిన్ ఫిక్స్..
ABN, Publish Date - Sep 20 , 2026 | 12:49 PM
ఇరుముడి’ విజయంతో మంచి జోష్‌లో ఉన్నారు మాస్ మహారాజా రవితేజ(Raviteja) . ప్రస్తుతం తదుపరి సినిమాలతో బిజీ అయ్యే పనిలో ఉన్నారు.
ఇరుముడి’ విజయంతో మంచి జోష్‌లో ఉన్నారు మాస్ మహారాజా రవితేజ(Raviteja) . ప్రస్తుతం తదుపరి సినిమాలతో బిజీ అయ్యే పనిలో ఉన్నారు. త్వరలోనే దర్శకుడు వివేక్ ఆత్రేయతో (Vivek athreya) కొత్త సినిమాను ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. రవితేజతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఈ చిత్రంలో కథానాయికగా తమిళ భామ ప్రియాంక అరుళ్ మోహన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. 2027 సమ్మర్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
లక్ష్మణ్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. వివేక్ ఆత్రేయ ఇప్పటికే ఈ సినిమా కోసం కథను సిద్ధం చేసినట్లు సమాచారం. రవితేజ ఇమేజ్‌కు తగ్గట్టుగా, భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రియాంక అరుళ్ మోహన్ విషయానికొస్తే.. గతంలో ‘గ్యాంగ్ లీడర్’, ‘OG’ వంటి తెలుగు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉన్న ఈమె.. కొంతకాలం తర్వాత మరో తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు మేకర్స్.