Ravi Teja: సంక్రాంతికి.. గోల గోల చేద్దాం
ABN, Publish Date - Jan 08 , 2026 | 06:04 AM
‘ఈ సారి సంక్రాంతికి సరదా సరదాగా గోల గోల చేద్దాం. పండగకు వస్తున్న అన్ని సినిమాలు వినోదాన్ని అందించబోతున్నాయి.’ అని రవితేజ అన్నారు.
‘ఈ సారి సంక్రాంతికి సరదా సరదాగా గోల గోల చేద్దాం. పండగకు వస్తున్న అన్ని సినిమాలు వినోదాన్ని అందించబోతున్నాయి.’ అని రవితేజ (Raviteja) అన్నారు. ఆయన కథానాయకుడిగా కిశోర్ తిరుమల (Kishore Tirumala) తెరకెక్కించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’(Bhartha Mahasayulaku Wignyapthi).
ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. డింపుల్ హయాతి (Dimple Hayathi), ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) కథానాయికలు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 13న విడుదల అవుతోంది. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో రవితేజ మాట్లాడుతూ ‘చాలా రోజుల తర్వాత కుటుంబ కథతో వస్తున్నాను. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. కిషోర్ తిరుమల మేకింగ్ బాగుంటుంది. ఆయన శైలిలో ఉంటూనే నా నుంచి అభిమానులు కోరుకునే అంశాలున్న సినిమా ఇది. అన్ని వర్గాల వారికీ రీచ్ అవుతుంది’ అని అన్నారు. ‘ఈ సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తారు’ అని కిశోర్ తిరుమల చెప్పారు. ‘ఈ సినిమా అందరికీ ఫుల్ మీల్స్ లాంటి వినోదాన్ని అందిస్తుంది. వింటేజ్ రవితేజను చూస్తారు’ అని సుధాకర్ చెరుకూరి తెలిపారు.