సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ర‌వితేజ‌.. 'ఇరుముడి' కొత్త లుక్‌ అదిరింది

ABN, Publish Date - Mar 27 , 2026 | 06:39 AM

రవితేజ (Ravi Teja) ఇంతవరకూ పోషించిన పాత్రలకు భిన్నమైన క్యారెక్టర్‌ చేస్తున్న సినిమా ‘ఇరుముడి’ .

raviteja

రవితేజ (Ravi Teja) ఇంతవరకూ పోషించిన పాత్రలకు భిన్నమైన క్యారెక్టర్‌ చేస్తున్న సినిమా ‘ఇరుముడి’ (Irumudi). శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ (Mythri Movie Makers) ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికి యాభై శాతం షూటింగ్‌ పూర్తయినట్లు నిర్మాతలు వెల్లడించారు.

ప్రస్తుతం అనల్‌ అరసు (Anal Arasu), రియల్‌ సతీశ్ (Real Satish) ఫైట్‌ మాస్టర్స్‌ ఆధ్వర్యంలో యాక్షన్‌ ఎపిసోడ్‌ చిత్రీకరిస్తున్నారు. ఇటీవలి కాలంలో చూడనటువంటి అద్భుతమైన ఫైట్స్ ఈ చిత్ర‌లో ప్రేక్షకులు చూస్తారని యూనిట్‌ చెబుతోంది.

యాక్షన్‌ ప్రధానంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నప్పటికీ ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్‌ అద్బుతంగా ఉంటాయని దర్శకుడు చెబుతున్నారు. ‘ఇరుముడి’ సినిమాలో బేబి నక్షత్ర (Baby Nakshathra) రవితేజ కుమార్తెగా నటిస్తోంది. వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని చూపించే పోస్టర్‌ను గురువారం యూనిట్‌ విడుదల చేసింది.

సాయికుమార్ (Sai Kumar), అజయ్‌ ఘోష్‌, రమేశ్‌ ఇందిర తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్‌ యర్నేని (Naveen Yerneni), వై రవిశంకర్ (Y. Ravi Shankar) నిర్మిస్తున్నారు. ప్రియా భ‌వాని శంక‌ర్ (Priya Bhavani Shankar) క‌థానాయిక కాగా జీవీ ప్ర‌కాశ్ కుమార్ (G.V.Prakash Kumar) సంగీతం అందిస్తున్నాడు.

Updated Date - Mar 27 , 2026 | 06:49 AM