సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రాత్రి తాగింది దిగలేదు.. అందుకే! ఇదెక్కడి మాస్ ప్రమోషన్స్‌రా అయ్యా..

ABN, Publish Date - Aug 14 , 2026 | 03:17 PM

మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో రాబోతోన్న సరికొత్త చిత్రం ‘ఇరుముడి’. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబి నక్షత్ర కీలక పాత్ర పోషిస్తోంది.

Irumudi Team Interview with Suma

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ (Shiva Nirvana) కాంబినేషన్‌లో రాబోతోన్న సరికొత్త చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబి నక్షత్ర కీలక పాత్ర పోషిస్తోంది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌లో సరికొత్త రూట్‌ను ఎంచుకుంది. సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచేందుకు సరికొత్త కాన్సెప్ట్‌తో కూడిన స్పెషల్ ఇంటర్వ్యూలను ప్లాన్ చేశారు. అందులో భాగంగా స్టార్ యాంకర్ సుమ (Anchor Suma)తో కలిసి చిత్రయూనిట్ చేసిన వినూత్నమైన ఇంటర్వ్యూ ప్రోమోను తాజాగా మేకర్స్ విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


తాజాగా విడుదలైన ఈ ప్రోమోలో యాంకర్ సుమ నేరుగా ‘ఇరుముడి’ ఫ్యామిలీ ఇంటికి అతిథిగా వచ్చినట్లు చూపించారు. అక్కడ హీరో రవితేజ (త్రినాధ్ పాత్రలో) సోఫాలో ప్రశాంతంగా కూర్చుని ఉండగా, చిన్నారి నక్షత్ర ఆయనకు తల మసాజ్ చేస్తూ కనిపిస్తుంది. ఇది చూసి ఆశ్చర్యపోయిన సుమ.. ‘అదేంటి ఆయనకు అలా మసాజ్ చేస్తోంది?’ అని భార్య పాత్రలో ఉన్న ప్రియా భవానీ శంకర్‌ను అడగ్గా, ఆమె నవ్వుతూ ‘రాత్రి తాగింది ఇంకా దిగలేదు.. అందుకే!’ అంటూ ఇచ్చిన అదిరిపోయే కౌంటర్ నవ్వులు పూయిస్తోంది. ఆ తర్వాత అరటిపండ్ల వ్యాపారం, ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాల వేసుకుని 41 రోజులు ఎంతో నిష్టగా ఉండే అలవాటు గురించి రవితేజ చెప్పే డైలాగులు, సుమ వేసే చమత్కారాలు నెటిజన్లను విశేషంగా అలరిస్తున్నాయి.


ఇంతలో దర్శకుడు శివ నిర్వాణ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చి ‘షాట్ అదిరిపోయింది’ అనడంతో, ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం చేసిన ఒక నేచురల్ స్కిట్ తరహా ఇంటర్వ్యూ అని అర్థమవుతుంది. ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్, రియలిస్టిక్ డ్రామా చాలా బలంగా ఉండబోతున్నాయని, థియేటర్లలో సాంగ్స్, సీన్స్ వచ్చేటప్పుడు ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తారని డైరెక్టర్, రవితేజ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం సినిమాలోని పాత్రలతోనే ఇలా వినోదాత్మకంగా ప్రమోషన్స్ చేయడం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ మాస్ ప్రోమో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

ప్రతీ 15 రోజులకూ.. నా పాస్‌వర్డ్స్ అన్నీ మారుస్తా: కింగ్ నాగార్జున

Rare Pic: ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు చిరుని ఏం చేద్దామనుకుంటున్నారో

వారంలోనే.. ఓటీటీలో హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ ‘లెనిన్’

Updated Date - Aug 14 , 2026 | 03:17 PM