100 కోట్ల క్లబ్‌లో.. 'ఇరుముడి'
ABN, Publish Date - Aug 25 , 2026 | 11:58 PM
మాస్ రాజా రవితేజ ( Ravi Teja), శివ నిర్వాణ కాంబోలో వచ్చిన 'ఇరుముడిస (irumudi )బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయంతో దూసుకుపోతోంది.
మాస్ రాజా రవితేజ ( Ravi Teja), శివ నిర్వాణ కాంబోలో వచ్చిన 'ఇరుముడిస (irumudi )బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయంతో దూసుకుపోతోంది. తన ఇమేజ్‌ను పూర్తిగా పక్కనపెట్టి రవితేజ చేసిన ఈ ప్రయోగం ఆయన కెరీర్‌కు సరికొత్త గుర్తింపును తెచ్చిపెట్టింది. సరైన విజయం కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న ఆయనకు ఇరుముడి ద్వారా ఊహించని స్థాయిలో బ్లాక్‌బస్టర్ హిట్ దక్కింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను ఈ చిత్రం దాటేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రవితేజ సినీ ప్రయాణంలో అత్యంత వేగంగా వంద కోట్ల క్లబ్‌లో చేరిన సినిమా ఇదే కావడం విశేషం.
'ఇరుముడి'పై 'టాక్సిక్' ఎఫెక్ట్ పడనుందా..?
తెలంగాణ బాటలోనే ఏపీ ప్రభుత్వం కూడా 'టాక్సిక్స (Toxic) సినిమా టిక్కెట్ ధరలను పది రోజుల పాటు పెంచుకునేలా జీవో జారీ చేసింది. ఈ చిత్ర ప్రత్యేక ప్రీమియర్ షోల కోసం బుధవారం ఉదయం ఆరు గంటలకు అనుమతి లభించగా, టిక్కెట్ ధరను రూ. 600గా నిర్ణయించారు. యశ్ నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం విడుదల నేపథ్యంలో, రవితేజ 'ఇరుముడి' సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న 'ఇరుముడి' వంద కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటగా, 'టాక్సిక్' ఫలితంపై దీని భవిష్యత్తు ఆధారపడి ఉంది. టాక్సిక్ కంటెంట్, రివ్యూల విషయంలో కాస్త తేడా వచ్చిన మరు నిమిషంలోనే తిరిగి ఇరుముడి ట్రాక్ పైకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.