‘గరివిడి లక్ష్మి’పై రవితేజ, తేజ సజ్జా ప్రశంసల వర్షం!
ABN, Publish Date - Oct 18 , 2026 | 02:25 PM
ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'గరివిడి లక్ష్మి' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'గరివిడి లక్ష్మి' ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాను వీక్షించిన మాస్ మహారాజా రవితేజ, తేజ సజ్జా చిత్రబృందాన్ని అభినందించారు. హృదయాన్ని తాకే కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంపై తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.
రవితేజ ఏమన్నారంటే?
‘గరివిడి లక్ష్మి’ సినిమాను చూశాను. నన్ను నిజంగా ఎంతో హత్తుకుంది. ఇందులోని ఆత్మీయత, స్వచ్ఛమైన భావోద్వేగాలు నన్ను ఆకట్టుకున్నాయి. లక్ష్మి గారి పాత్రలో అనంది జీవించారు. సినిమాలోని ప్రతి ఒక్క కళాకారుడు తమ అత్యుత్తమ నటనను కనబరిచారు. దర్శకుడు గౌరీనాయుడు జమ్ము సినిమాను ఎంతో చక్కగా తెరకెక్కించారు. మనసులను తాకే, ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసే అర్థవంతమైన సినిమాలకు మద్దతుగా నిలుస్తున్న కృతి ప్రసాద్కు ప్రత్యేక అభినందనలు. టీజీ విశ్వప్రసాద్ గారితో పాటు చిత్రబృందం మొత్తానికి శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు.
తేజ సజ్జా అభినందనలు
‘గరివిడి లక్ష్మి’ సాధించిన అద్భుతమైన విజయానికి నా హృదయపూర్వక అభినందనలు. ఇంత మంచి కథాంశంతో రూపొందిన సినిమాకు మద్దతుగా నిలిచి, మొదటి రోజు నుంచే అదే నమ్మకంతో ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్తున్న కృతి ప్రసాద్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన పీఎంఎఫ్ (PMF) బృందం మొత్తాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. చిత్రబృందం మొత్తానికి నా శుభాకాంక్షలు" అని అన్నారు.