బాడీ డబుల్ లేకుండా 20 గంటల పాటు ఫైట్.. రష్మిక రేర్ రికార్డ్
ABN, Publish Date - Jul 09 , 2026 | 09:26 PM
నేషనల్ క్రష్ రష్మిక మందన్న సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’ షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’ (Mysaa) షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆమె కెరీర్‌లోనే అత్యంత సవాల్‌తో కూడిన పాత్రను చేస్తూ, ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేయగా.. ఇప్పుడు రష్మిక చేస్తున్న రిస్కీ స్టంట్స్ మరింతగా ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రవీంద్ర పుల్లే (Rawindra Pulle) దర్శకత్వంలో, అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక గోండ్ గిరిజన యువతి పాత్రలో కనిపించనుంది. ఈ పాత్ర కోసం ఆమె షూటింగ్ ప్రారంభానికి ముందే ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని, శారీరకంగా, మానసికంగా సిద్ధమయ్యారనేలా టీమ్ చెబుతూ వస్తోంది.
తాజాగా ఈ సినిమా కోసం అత్యంత ప్రమాదకరమైన యాక్షన్ సన్నివేశాలను రష్మిక స్వయంగా చేయడంతో.. ఆమె పేరు ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది. రెండు రోజుల పాటు దాదాపు 20 గంటలు నీటిలో ఉండి అత్యంత క్లిష్టమైన అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్‌ను ఆమెపై మేకర్స్ చిత్రీకరించారు. భారతీయ సినీ చరిత్రలో ఓ హీరోయిన్ స్వయంగా చేసిన మొట్టమొదటి అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్ ఇదే కావడం విశేషం. ఈ సన్నివేశం కోసం బాడీ డబుల్‌ను ఉపయోగించకుండా, స్వయంగా నటించాలని రష్మిక నిర్ణయించుకోవడంతో ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి. సన్నివేశాల్లో సహజత్వం కోసం ఆమె చూపించిన ఈ అంకితభావం సినిమా టెక్నికల్ టీమ్‌తో పాటు అండర్‌వాటర్ యాక్షన్ టీమ్‌ను కూడా ఆశ్చర్యానికి గురి చేసిందట.
ఈ అండర్‌వాటర్ ఎపిసోడ్ కేవలం యాక్షన్ సీన్ మాత్రమే కాదని, ఇందులో ఆకట్టుకునే విజువల్స్ ఉంటాయని టీమ్ చెబుతోంది. నిజంగా ఈ సీన్ గొప్పతనం తెలియాలంటే మాత్రం.. సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. రాహుల్ రవీంద్ర, ఈశ్వరి రావు ఇతర కీలక పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రం.. ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది. త్వరలోనే సినిమా టీజర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ధనుష్ ‘ఓమ్’లో బాలీవుడ్ దిగ్గజం.. క్రేజీ అప్డేట్
ఇది చాలు సార్.. కన్నీళ్లు తెప్పిస్తోన్న నిరంజన్ తండ్రి మాటలు
బాలయ్య సినిమాలో రోల్‌పై కాజల్ షాకింగ్ కామెంట్స్!