Rashmika Mandanna: కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో రష్మికకు అరుదైన గౌరవం..
ABN , Publish Date - Jul 22 , 2026 | 03:04 PM
జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రత్యేక గుర్తింపును చాటుకుంటున్నరష్మిక మందన్నకు మరో అరుదైన గౌరవం దక్కనున్నట్లు సమాచారం.
జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రత్యేక గుర్తింపును చాటుకుంటున్నరష్మిక మందన్నకు (Rashmika Mandanna) మరో అరుదైన గౌరవం దక్కనున్నట్లు సమాచారం. కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకకు ఆమె హాజరుకానున్నట్లు తెలిసింది. ఆగస్టు 2న జరగనున్న కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు శంకర్ మహదేవన్‌తో (Shankar Mahadevan) కలిసి రష్మిక వేదికను పంచుకోనున్నట్లు సమాచారం. భారతదేశం తరఫున నిర్వహించే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలకు, ప్రత్యేక ప్రదర్శనలో వీరిద్దరూ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారని తెలిసింది. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఈ వేడుకల్లో కామన్వెల్త్ గేమ్స్ అధికారిక పతాకాన్ని భారత్‌కు అధికారికంగా అందజేయనున్నారు. 2030లో జరగనున్న 100వ వార్షికోత్సవ కామన్వెల్త్ గేమ్స్‌కు గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదిక కానున్న విషయం తెలిసిందే. 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించిన తర్వాత, భారత్ మరోసారి ఈ ప్రతిష్ఠాత్మక క్రీడలకు ఆతిథ్యం ఇవ్వబోతోంది.
Also Read: IMAX: అమ్మబాబోయ్.. ఐమాక్స్ సినిమా అంటే ఇలా ఉంటుందా...
OG: బుల్లితెరపైకి పవర్ స్టార్ 'ఓజీ'..
Vijay: రావణుడిగా సీఎం విజయ్.. అమ్మవారిగా త్రిష..