Rao Bahadur Satya Dev: ఇదెక్కడి షాక్‌రా మామ.. ఇది అసలు ఊహించలే! రావుబహదూర్‌గా సత్యదేవ్
ABN , Publish Date - Aug 12 , 2025 | 01:09 PM
తరుచూ విభిన్న చిత్రాలతో అలరిస్తూ విలక్షణ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న నటుడు సత్యదేవ్ .
తరుచూ విభిన్న చిత్రాలతో అలరిస్తూ విలక్షణ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న నటుడు సత్యదేవ్ (Satya Dev). ఇటీవల కింగ్డమ్ చిత్రంలో విజయ్ దేవరకొండ అన్నగా నటించి అందరికన్నా తనే అధిక పేరు గడించాడు. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న రావుబహదూర్ (Rao Bahadur) మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య, కేరాఫ్ కంచరపాలెం వంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపును దక్కించుకున్న వెంకటేశ్ మహా (Venkatesh Maha) ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండడం విశేషం.
Doubt is a Demon అనుమానం పెనుభూతం అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ స్టన్నింగ్ ఉండి సినీ లవర్స్ షాక్ అయ్యేలా ఉంది. సత్యదేవ్ నెవర్ భిఫోర్ అవతార్ లుక్‌లో మెస్మరైజ్ చేశాడు. వృద్ధుడి గెటప్‌లో ఎవరు గుర్తించలేనంతగా సగటు ప్రేక్షకుడు థ్రిల్ అయ్యేలా ఆ పోస్టర్ ఉంది.
ఇదిలాఉంటే ఈ సినిమాను సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) నిర్మాణ సంస్థ జీఎమ్బీ ఎంటర్ టైన్‌మెంట్ (GMB Entertainment) సమర్పిస్తుండగా శ్రీచక్రాస్ ఎంటర్ టైన్‌మెంట్స్ (Srichakraas Entertainments), అప్లాజ్ మూవీస్ (AplusS Movies) సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2026 వేసవిలో ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాకు సంబంధఙంచి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.