సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rana Daggubati: పాములు, మొసళ్ళను కూడా తింటాను..

ABN, Publish Date - May 27 , 2026 | 03:11 PM

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా కెరీర్ ని మొదలుపెట్టిన రానా..

Rana Daggubati

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా కెరీర్ ని మొదలుపెట్టిన రానా.. స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేనప్పటికీ నటుడిగా పాన్ ఇండియా క్రేజ్ ని అందుకున్నాడు. బాహుబలి సినిమాలో భల్లాలదేవా పాత్రలో రానా నటన ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసింది. ప్రస్తుతం నిర్మాతగా, బిజినెస్ మ్యాన్ గా, నటుడిగా బిజీగా ఉన్న రానా ఒక ఇంటర్వ్యూలో తనకిష్టమైన ఫుడ్ గురించి చెప్పి అభిమానులను షాక్ కి గురిచేశాడు.


రానా ఒక ఫుడ్ లవర్ అని అందరికీ తెల్సిందే. సాధారణంగా ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే పెరుగన్నమో, రసమో వేసుకొని తింటారు. కానీ, రానా మాత్రం పొగలు కక్కే బిర్యానీ, హలీమ్ తింటాడట.. ఈ విషయాన్నీ స్వయంగా రానా భార్య మిహీక ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక అదే విషయాన్నీ రానా కూడా ఒప్పుకున్నాడు. ముక్క లేనిదే ముద్ద దిగదని.. తనెంత నాన్ వెజిటేరియనో ఉదాహారణలతో కూడా చెప్పుకొచ్చాడు. ఇండియాలో ఉన్నప్పుడు సి ఫుడ్ ఎక్కువ ఇష్టపడతానని చెప్పిన రానా .. విదేశాలలో పాములను, మొసళ్ళను కూడా తిన్నానని చెప్పి షాక్ ఇచ్చాడు.


' నేను ఫుల్ మాంసాహారిని. ఏ దేశం వెళ్తే అక్కడి లోకల్ ఫుడ్ ని తింటాను. మీరు భయపడే వాటిని కూడా నేను తిన్నాను. పాములు, మొసళ్ళను కూడా తిన్నాను. అలాంటి నాన్ వెజిటేరియన్ అయిన నేను చంద్రబాబు నాయుడు పాత్ర కోసం ఫుల్ వెజ్ తినాల్సి వచ్చింది. బరువు తగ్గడానికి మొత్తం శాకాహారిగా మారాను. ఆ సినిమా షూటింగ్ అయ్యాకా.. హలీమ్ ఒక్క స్పూన్ నాతో పెట్టుకోగానే కళ్ళవెంట నీళ్లు వచ్చేసాయని' తెలిపాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి:

‘రంగస్థలం’ చిట్టిబాబుకి, ‘పెద్ది’కి ఉన్న తేడా ఏంటంటే?

ఫ్యాన్స్‌కు బాల‌య్య ఝ‌ల‌క్‌.. సింహం సింగిల్ రోల్‌లోనే

‘అమ్మ’కు ఏమైంది? మరో సీనియర్ నటి సంచలన ఆరోపణలు!

Updated Date - May 27 , 2026 | 03:32 PM