సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తెలుగు ప్రేక్షకులకు యశ్ ప్రత్యేక విజ్ఞప్తి.. సాయి పల్లవి అద్భుతం

ABN, Publish Date - Oct 20 , 2026 | 08:38 AM

‘రామాయణ’తొలి భాగం నవంబర్ 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్‌లో గ్రాండ్ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

yash

రణ్‌బీర్ కపూర్ ( Ranbir Kapoor), యశ్ (Yash), సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘రామాయణం’ (Ramayana Movie) వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. నితేష్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, DNEG, యశ్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పింది. రెండు భాగాల సినిమాటిక్ ఇతిహాసంగా ‘రామాయణ’ రూపొందుతోంది. తొలి భాగం 2026 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎస్‌వీసీ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్‌లో గ్రాండ్ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ లో రాకింగ్ స్టార్ యశ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. రెండు నెలల క్రితం మీ అందరినీ కలిశాను. నేను చేసిన వర్క్ గురించి చెప్పాను. మీరందరూ ఎంతో ప్రేమతో సినిమాను చూడడానికి వచ్చారు. కొందరికి నచ్చింది, మరికొందరికి నచ్చలేదు. ఏదేమైనా, మీరు నాపై ఎంతో ప్రేమతో వచ్చారు. మీ ప్రేమకు ధన్యవాదాలు. మీ ప్రేమే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి మేము పనిచేస్తున్నాం. రాజమౌళి గారు, ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు.. ఇలా అందరూ మన ఇండస్ట్రీ ఎలాంటి అద్భుతాలు చేయగలదో చూపించారు.

దిల్ రాజు గారితో ఇది నా మూడో కొలాబరేషన్. ఒక మంచి సినిమా తీయాలంటే మంచి ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ కావాలి. అలాంటి ప్యాషన్ ఉన్న వ్యక్తి దిల్ రాజు గారు. ఆయన డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు కూడా ఎంతో కేర్ తీసుకుంటారు. తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి డైలాగులు ఉండాలనే విషయంలో దగ్గరుండి ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. ఆయన సపోర్ట్‌కు ధన్యవాదాలు. రకుల్ తెలుగు అమ్మాయి. శూర్పణఖ పాత్ర చేయడం అంత ఈజీ కాదు. సీత‌ పాత్రలో సాయి పల్లవి గారు అద్భుతంగా చేశారు. రణ్‌బీర్ కపూర్ అద్భుతమైన మనిషి. తనకు ఎలాంటి ఇగో ఉండదు. తను చాలా మంచి మనసున్న వ్యక్తి. ఎన్నో అద్భుతమైన పాత్రలతో తన ప్రతిభను నిరూపించుకున్నారు. రాముడి పాత్ర కూడా మీ అందరి మనసుల్లో నిలిచిపోతుంది.

నితీష్ గారు తన వర్క్‌తోనే మాట్లాడే డైరెక్టర్. ఆయన మంచి టీమ్ ప్లేయర్. ఆయనతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన వల్ల ఈ జర్నీ అంతా చాలా స్మూత్‌గా సాగింది. నమిత్ మల్హోత్రా చాలా ప్యాషన్ ఉన్న నిర్మాత. ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయిలో టాప్ లెవెల్‌లో నిలబెట్టాలని ఆయన అనుకుంటున్నారు. ఆయన ఈ విషయం చెప్పినప్పుడు నేను రావణుడి పాత్ర చేస్తానని చెప్పాను. అలాగే ఈ సినిమాను నిర్మిస్తానని కూడా చెప్పాను. ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆయన నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. నాకంటే ఎక్కువగా ఈ సినిమా కోసం కేర్ తీసుకున్నారు. సోనీ సంస్థ ఈ సినిమాను గ్లోబల్‌గా రిలీజ్ చేస్తోందంటే, అదంతా అంత ఈజీగా జరగలేదు. నమిత్ గారు దానికోసం ఎంతో హార్డ్ వర్క్ చేశారు. ప్రతి ప్రేక్షకుడు, అభిమానులు సినిమాపై ప్రేమ చూపించాలని కోరుకుంటున్నాను. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.

Updated Date - Oct 20 , 2026 | 08:38 AM