సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రామ్ పోతినేని బిగ్ సర్‌ప్రైజ్.. హీరోయిన్‌గా క్రేజీ బ్యూటీ

ABN, Publish Date - Sep 11 , 2026 | 11:15 PM

టాలీవుడ్ తెరపై తన అల్లరి, అంతులేని ఉత్సాహంతో మొదటి సినిమాతోనే యూత్‌ని తనవైపు తిప్పుకున్న కుర్రాడు రామ్ పోతినేని. తనదైన మాస్ డాన్స్ మూవ్‌మెంట్స్, పంచ్ డైలాగ్ డెలివరీతో ‘ఎనర్జిటిక్ స్టార్’గా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.

Samyuktha in Rapo23

టాలీవుడ్ తెరపై తన అల్లరి, అంతులేని ఉత్సాహంతో మొదటి సినిమాతోనే యూత్‌ని తనవైపు తిప్పుకున్న కుర్రాడు రామ్ పోతినేని. తనదైన మాస్ డాన్స్ మూవ్‌మెంట్స్, పంచ్ డైలాగ్ డెలివరీతో ‘ఎనర్జిటిక్ స్టార్’గా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. లవర్ బాయ్ పాత్రలైనా, నరనరాన మాస్ ఎనర్జీ నింపే యాక్షన్ ఎంటర్‌టైనర్లయినా.. తెరపై తన పూర్తి శక్తిని ధారబోస్తూ అభిమానులను ఉర్రూతలూగించడం రామ్‌కు వెన్నతో పెట్టిన విద్య. అయితే, ఈ ఎనర్జిటిక్ స్టార్‌కు ఇటీవల కాలంలో సరైన హిట్ కరువైందనే చెప్పాలి.

పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సునామీ సృష్టించిందో తెలిసిందే. కానీ, ఆ సినిమా తర్వాత రామ్ ఆ స్థాయి విజయాన్ని మళ్ళీ చూడలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన ‘రెడ్’, ‘ది వారియర్’, ‘స్కంద’, అలాగే భారీ అంచనాలతో వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’, ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ వరుసగా నిరాశనే మిగిల్చాయి. దీంతో తన రూట్ మార్చిన రామ్, ఈసారి ఏకంగా దర్శకుడి అవతారం ఎత్తారు. రామ్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలోనే #RAPO23 మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని, షూటింగ్ కూడా వేగంగా జరుపుకుంటోంది.


అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇందులో రామ్ సరసన నటించే హీరోయిన్ ఎవరనే ప్రశ్న సినీ వర్గాల్లో, అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. గతంలో సంయుక్త ఈ సినిమాలో నటించబోతోందనే వార్తలు గట్టిగానే వినిపించినప్పటికీ, మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. కానీ, తాజాగా మేకర్స్ దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. శుక్రవారం సంయుక్త (Samyuktha) పుట్టినరోజును పురస్కరించుకుని, ఆమెకు బర్త్‌డే విషెస్ చెబుతూ.. ఈ ప్రాజెక్ట్‌లోకి గ్రాండ్‌గా ఆహ్వానిస్తున్నట్లు అఫీషియల్ అప్‌డేట్ ఇచ్చారు. దీంతో రామ్ సరసన ఈ గోల్డెన్ లెగ్ బ్యూటీ నటిస్తుందని ఖరారైపోయింది. రామ్ పోతినేని, సంయుక్త కలసి నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడంతో, ఈ కొత్త జోడీ తెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో అని టాలీవుడ్ విశ్లేషకులతో పాటు ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌కు సామ్ సి.యస్ సంగీతం అందిస్తుండగా, రామ్ పోతినేని సోదరుడు కృష్ణ పోతినేని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.


ఈ ‘RAPO23’ చిత్రాన్ని ఒక మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారట. నియో నోయర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో రామ్ ఇప్పటివరకు ఎన్నడూ కనిపించని ఒక సరికొత్త అవతార్‌లో కనిపించబోతున్నారట. కథ, క్యారెక్టరైజేషన్, ట్రీట్‌మెంట్.. ఇలా ప్రతీ విషయంలోనూ రామ్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా రామ్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని టాక్. మరి స్వయంగా రామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడో చూడాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడకతప్పదు.

ఇవి కూడా చదవండి:

చిరు ‘కాకా’పై థమన్ మాస్ ప్రామిస్.. థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!

ప్రముఖ ఓటీటీ లైన్‌లోకి.. ‘విశ్వంభర’ రిలీజ్‌కు క్లియరెన్స్ వచ్చినట్టేనా?

రామాయణం టు శ్రీమద్భాగవతం.. భారీ సినిమాటిక్ యూనివర్స్‌కు సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Updated Date - Sep 11 , 2026 | 11:15 PM