సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘RC17’ మొదలయ్యేది అప్పుడే!

ABN, Publish Date - Jul 26 , 2026 | 06:27 PM

‘పెద్ది’ మేనియా ముగియడంతో మెగా అభిమానుల చూపు ఇప్పుడు మొత్తం రామ్ చరణ్ తదుపరి ప్రాజెక్ట్ RC17 పైనే పడింది. ‘రంగస్థలం’ వంటి సంచలన విజయం తర్వాత రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

RC17 Update

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) ఇటీవల ‘పెద్ది’ (Peddi) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ‘పెద్ది’ మేనియా ముగియడంతో మెగా అభిమానుల చూపు ఇప్పుడు మొత్తం రామ్ చరణ్ తదుపరి ప్రాజెక్ట్ RC17 పైనే పడింది. ‘రంగస్థలం’ వంటి సంచలన విజయం తర్వాత రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, ఇటీవల ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఆలస్యం కానుందంటూ వచ్చిన వార్తలు మెగా అభిమానుల్లో కొంత కలవరాన్ని కలిగించాయి. గతంలో ‘పుష్ప, పుష్ప 2’ చిత్రాల మేకింగ్ కోసం సుకుమార్ ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడంతో, RC17 కూడా అదే రకంగా సుదీర్ఘ సమయం తీసుకుంటుందేమోనని సోషల్ మీడియా వేదికగా రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి.


అయితే.. ఆ ప్రచారాలన్నింటికీ పుల్‌స్టాప్ పెడుతూ ఇండస్ట్రీ వర్గాల నుంచి మెగా అభిమానుల కోసం ఒక ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వర్గాల నుంచి వినిపిస్తోన్న సమాచారం ప్రకారం... దర్శకుడు సుకుమార్ ఇప్పటికే RC17 ఫైనల్ స్క్రిప్ట్‌ను ఎటువంటి మార్పులు లేకుండా పూర్తిగా లాక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా, ఇది రెండు భాగాలుగా వచ్చే సినిమా అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, ఒకే భాగంలో పూర్తయ్యే లార్జర్ దెన్ లైఫ్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనుందని టాక్. ఈసారి సుకుమార్ కథాంశం విషయంలో ఒక భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. ఇదివరకు చేసిన పీరియాడిక్ లేదా మాఫియా బ్యాక్‌డ్రాప్‌లకు భిన్నంగా, పూర్తి స్థాయి కొత్త తరహా కమర్షియల్ యాక్షన్ డ్రామాగా ఈ కథను తీర్చిదిద్దారట. ‘రంగస్థలం’లో చిట్టిబాబుగా రామ్ చరణ్‌లోని సరికొత్త నటనా కోణాన్ని ఆవిష్కరించిన సుకుమార్, ఈ చిత్రంలో ఆయనను ఇప్పటివరకు ఎవరూ చూడని విభిన్నమైన అవతారంలో చూపించబోతున్నారట. చరణ్ పాత్ర రూపకల్పన విశేషంగా వచ్చిందని, తెరపై ఆయన మాస్ మేనియా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుందని టాక్ నడుస్తోంది.


ఇక తాజా నివేదికల ప్రకారం సెప్టెంబర్ నెలలో ఈ చిత్రాన్ని ఘనంగా ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేస్తున్నారట మేకర్స్. ఆ వెంటనే, నవంబర్ నుంచి ఏమాత్రం ఆలస్యం లేకుండా రెగ్యులర్ షూటింగ్‌ను పట్టాలెక్కించేలా పూర్తి షెడ్యూల్స్ సిద్ధం చేశారు. పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగుతుండటంతో ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందనే రూమర్లకు పూర్తిగా చెక్ పడినట్లయింది. ఈ తీపి కబురుతో మెగా అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అవుతోంది. మరి ఈ సినిమాతో సుకుమార్-రామ్ చరణ్ మరోసారి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

ఆ అమ్మవార్ల ఆశీస్సులతో.. ‘అగధ’ పబ్లిసిటీ జాతర మొదలు

బాలయ్యకు సర్జరీ.. నారా బ్రహ్మణి ఏం చెప్పారంటే

రామా ఏంటిది.. ప్రమోషన్స్ కోసమే రూ. 375 కోట్లా?

Updated Date - Jul 26 , 2026 | 06:27 PM