‘ఇట్లు అర్జున’ చూసి షాకయ్యా.. అనీష్‌పై రామ్ చరణ్ ప్రశంసలు!
ABN , Publish Date - Nov 10 , 2026 | 05:20 PM
అనీష్, అనశ్వర రాజన్ జంటగా నటించిన ‘ఇట్లు అర్జున’ నవంబర్ 13న విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన మ్యూజికల్ కాన్సర్ట్‌లో రామ్ చరణ్, నాగార్జున, అఖిల్ అక్కినేని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనీష్ నటన అద్భుతంగా ఉందంటూ రామ్ చరణ్ ప్రశంసించగా, సినిమా చాలా బాగుందని నాగార్జున తెలిపారు.
కింగ్ నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, అనశ్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాతో మహేష్ ఉప్పల దర్శకుడిగానూ, దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగానూ పరిచయం అవుతున్నారు. ఈ మూవీకి ఎస్. తమన్ అందించిన పాటలన్నీ చార్ట్ బస్టర్ అయ్యాయి. ‘ఇట్లు అర్జున’ నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. కింగ్ నాగార్జున, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, అఖిల్ అక్కినేని ముఖ్య అతిథులు పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
ఇందులో రామ్ చరణ్ మాట్లాడుతూ, 'కింగ్ నాగార్జున గారి ఫ్యాన్స్ కి, మా అభిమానులందరికీ థాంక్యూ సో మచ్. అనీష్ హీరోగా లాంచ్ కావడం చాలా ఆనందంగా ఉంది. తన తల్లిదండ్రులు చాలా అద్భుతమైన వ్యక్తులు. అనీష్‌కు సపోర్ట్ చేసిన వాళ్ల పేరెంట్స్‌కి థాంక్స్ చెప్తున్నాను. తనకు మరో పెద్ద సపోర్ట్ కింగ్ నాగార్జున గారు. ఆయన ఎప్పుడూ కొత్త టాలెంట్‌ను పరిచయం చేస్తూ, ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు అనీష్‌ను కూడా ఎంకరేజ్ చేయడం ఆనందంగా వుంది. అలాగే ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్న వెంకీకి, డైరెక్టర్ మహేష్‌కి ఆల్ ది బెస్ట్. అనశ్వర చాలా అద్భుతమైన నటి. తమన్ విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ గారి ‘ఓజీ’ సినిమాకైనా, అనిష్ ‘ఇట్లు అర్జున’కైనా సమానంగా మ్యూజిక్ చేస్తారు. తన మ్యూజిక్‌తో లక్షల మందిని కనెక్ట్ చేస్తాడు. అది పెద్ద హీరోనా, చిన్న హీరోనా అనేది చూడడు. అందరికీ ఒకేలా అద్భుతమైన మ్యూజిక్ ఇస్తాడు. ఇందులో పాటలన్నీ చాలా బాగున్నాయి. అనీష్‌కి సినిమా అంటే చాలా ఫ్యాషన్. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు నాకు చూపించాడు. నేను నా ఫస్ట్ సినిమాకు ఎలా చేశానో తెలియదు కానీ, నాకంటే పది రెట్లు బెటర్‌గా చేశాడు. తనకు కచ్చితంగా చాలా పెద్ద ఫ్యూచర్ ఉంటుంది. మూగవాడిగా నటించినప్పటికీ అన్ని నవరసాలను పలికించాడు. ప్యూర్ యాక్టింగ్ ఉంటే తప్ప అంత అద్భుతంగా చేయలేం. నేను కూడా ‘రంగస్థలం’ సినిమాలో చెవిటివాడిగా నటించాను. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అంతకంటే పెద్ద విజయం ఈ సినిమాతో అనీష్‌కు రావాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ, 'ఈ వేడుకకు వచ్చిన రామ్ చరణ్‌కి థాంక్యూ. తను చాలా హంబుల్ పర్శన్. మా పెద్దబ్బాయి తారక్ ఇక్కడికి రాలేకపోయాడు. తను ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశాడు. థాంక్యూ తారక్. అనీష్ గ్లింప్స్ తీసుకొచ్చి వాయిస్ ఓవర్ చేయమని అడిగాడు. తన సినిమాలో మూగవాడిగా నటిస్తున్నాడు. తొలి సినిమాకే ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ చేయడం అవసరమా అని అడిగాను. రామ్ చరణ్ ఒక చెవిటి పాత్ర చేయడానికి పదేళ్లు పట్టింది. అఖిల్ ఆరో సినిమాకు బ్లైండ్ క్యారెక్టర్ చేశాడు. అయితే ‘ఇట్లు అర్జున’ కథ మీద అనీష్‌కు చాలా నమ్మకం ఉంది. నాకు సినిమా చూపించారు. సినిమా చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. అనీష్ అద్భుతంగా తన పాత్రలో లీనమైపోయాడు. సినిమా చాలా బాగుంది. తన కళ్లతో మాట్లాడాడు. తన సైలెన్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. అనీష్, అనస్వర కెమిస్ట్రీ సినిమాలో చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అలాగే తమన్ ఇచ్చిన ప్రతి పాట హిట్ అయింది. ఈ సినిమాను ప్రెజెంట్ చేయడం చాలా గర్వంగా ఉంది' అని అన్నారు.
హీరో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ, 'డైరెక్టర్ మహేష్ చాలా కొత్త కథ రాశారు. మాటలు లేకుండా హీరో సినిమా చేయడం అనేది చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. అసలు దీన్ని ఎలా చేయబోతున్నారు అనుకున్నాను. నేను సినిమా చూశాను. అనీష్ చాలా అద్భుతంగా చేశాడు. సినిమాను కూడా చాలా అద్భుతంగా తీశారు. ఇది చాలా కమర్షియల్ సినిమా. థియేటర్లో చాలా అద్భుతంగా ఉంటుంది. తమన్ నాకు ‘లెనిన్’ సినిమాకు ఇచ్చినట్టే ‘ఇట్లు అర్జున’కు కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది. అనీష్ సినిమా కోసం చాలా కష్టపడతాడు. తనకు సినిమా అంటే చాలా గౌరవం. తన తొలి సినిమాకే ఇంత అద్భుతంగా చేయడం చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. ఈ సినిమా గట్టిగా కొట్టబోతున్నాడు' అని చెప్పారు.
హీరో అనీష్ మాట్లాడుతూ, 'అక్కినేని ఫ్యాన్స్‌కి, మెగా ఫ్యాన్స్‌కి థాంక్యూ. తమన్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ప్రతి పాట ఒక బ్యాంగర్ గా నిలిచింది. నన్ను ఇంతగా బిలీవ్ చేసిన నిర్మాత వెంకీ అన్నకి థాంక్యూ. మా ప్రొడక్షన్ టీమ్‌లోని ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నన్ను నమ్మి ఇంత మంచి కథ రాసిన డైరెక్టర్ మహేష్‌కి థాంక్యూ. ఆయన నాకు ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే మా డీఓపీ రాజా గారు మీ అందరినీ సర్ప్రైజ్ చేస్తారు. మా టీమ్ మెంబర్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సందర్భంగా నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. ఇది నా తొలి సినిమా. ఇంకా చాలా నేర్చుకోవాలి, చాలా దూరం వెళ్లాలి. ఇది నా తొలి అడుగు మాత్రమే. మీరందరూ నవంబర్ 13న థియేటర్‌కు వచ్చి సినిమా చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అర్జున్ మాట్లాడలేకపోవచ్చు కానీ, తన ప్రేమ మీ అందరికీ వినిపిస్తుంది' అని చెప్పారు. హీరోయిన్ అనశ్వర రాజన్ మాట్లాడుతూ,'తమన్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మాకు ఎంతో సపోర్ట్ చేశారు. డైరెక్టర్ మహేష్ గారు చాలా గొప్ప విజన్‌తో ఈ సినిమాను తీశారు. అనీష్ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. అర్జున్ క్యారెక్టర్‌కు తన బెస్ట్ ఇచ్చారు. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. నాగార్జున గారు ఈ సినిమాను ప్రెజెంట్ చేయడం నాకు మరింత ఆనందాన్ని ఇచ్చింది' అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ, 'మూగవాడిగా ఒక సినిమా చేయడం అనేది చాలా ఛాలెంజ్. అలాంటి ఛాలెంజ్‌ను తన తొలి సినిమాకే అనీష్ తీసుకున్నాడు. నేను కూడా మ్యూజికల్‌గా ఛాలెంజ్ తీసుకున్నాను. పాటలన్నింటినీ ప్రేక్షకులు చాలా బాగా ఆదరించారు. ఇది చాలా సర్ప్రైజింగ్ ఫిల్మ్. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది' అని అన్నారు. ఈ కార్యక్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్, టీఎఫ్డీసి ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు, డీఓపీ రాజా తదితరులు పాల్గొన్నారు.
నిర్మాత వెంకీ కుడుముల మాట్లాడుతూ, 'మాటలు లేకుండా సినిమా అనుకున్నప్పుడు అందరూ రిస్క్ అని అన్నారు. ఈ సందర్భంగా నాగార్జున గారి గురించి చెప్పాలి. ఆయన తన కెరీర్లోనే ఎక్కువ రిస్క్ తీసుకున్న హీరో. స్టార్ హీరో అయి ఉండి కూడా ఎంతోమంది కొత్తవారితో పని చేశారు. అలా ఆయన రిస్క్ తీసుకోవడం వల్ల మాకు ‘శివ’ లాంటి క్లాసిక్ సినిమా వచ్చింది. అలాగే అఖిల్ గారు కూడా వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం ‘లెనిన్’ లాంటి సినిమాతో సూపర్ బ్లాక్‌బస్టర్ కొట్టారు. అలాగే మెగాస్టార్ గారి లెగసీ కంటిన్యూ చేయడానికి చరణ్ గారు సినిమాల్లోకి రావడం కూడా చాలా పెద్ద రిస్క్. తన హార్డ్ వర్క్, డెడికేషన్‌తో చిరంజీవి గారి అభిమానులు, ప్రేక్షకులు గర్వంగా ఫీల్ అయ్యే స్థాయిలో ఉన్నారు. వీళ్లందరూ రిస్క్ తీసుకుని, హార్డ్ వర్క్ చేసి ఇక్కడి వరకు వచ్చారు. వీళ్లందరినీ చూస్తున్నప్పుడు మేము ఎందుకు రిస్క్ తీసుకోకూడదు అనిపించింది. అదే ఈ సినిమా' అని అన్నారు. డైరెక్టర్ మహేష్ మాట్లాడుతూ, 'అనీష్ తన క్యారెక్టర్‌కు పూర్తి న్యాయం చేశాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తమన్ గారు అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఆర్ఆర్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. నానాగార్జున గారు ఇచ్చిన సజెషన్స్ సినిమాకు చాలా హెల్ప్ అయ్యాయి. మా సినిమాను అందరూ తప్పకుండా థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.