‘పెద్ది’లో చరణ్ పెర్ఫార్మెన్స్‌కు ‘రంగస్థలం’ సరిపోదు- సుకుమార్

ABN , Publish Date - May 01 , 2026 | 09:10 PM

‘పెద్ది’ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కార్యక్రమానికి హాజరైన సుకుమార్.. ‘పెద్ది’లో రామ్ చరణ్ నటన, ‘రంగస్థలం’లోని నటనకు మించి ఉంటుందని అన్నారు.

Sukumar About Peddi Movie

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా నటిస్తోన్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని, ఫైనల్‌గా జూన్ 4న విడుదల చేయబోతున్నట్లుగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కార్యక్రమానికి హాజరైన సుకుమార్ (Director Sukumar).. ‘పెద్ది’లో రామ్ చరణ్ నటన, ‘రంగస్థలం’లోని నటనకు మించి ఉంటుందని అన్నారు.


ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. ‘ఉప్పెన’ మూవీ క్లైమాక్స్ చూసినప్పుడు ఆ సినిమా తీసిన డైరెక్టర్ ఎలాంటి సినిమా అయినా చేయగలడనిపించింది. బుచ్చిబాబు ‘పెద్ది’ కోసం చాలా మంచి స్క్రిప్ట్ రాశాడు. ఇందులో ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్‌ని అద్భుతంగా బ్యాలెన్స్ చేశాడు. నిజంగా, అలాంటి బ్యాలెన్స్ పట్టుకోవాలంటే చాలా అనుభవం ఉండాలి. ‘పెద్ది’ వంటి కమర్షియల్ ఎమోషనల్ రైడ్ ఈ మధ్యకాలంలో రాలేదు. స్క్రీన్‌పై సాంగ్స్ చూసినప్పుడు సినిమా వేరే లెవెల్‌లో ఉంటుందనిపించింది. రత్నవేలు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. చరణ్‌ని అద్భుతంగా చూపించినందుకు ఆయనకు థ్యాంక్యూ. మొన్న వచ్చిన టీజర్ విజువల్స్ మామూలుగా లేవు.


నిర్మాత సతీష్ చాలా మంచి వ్యక్తి. ఆయన మొదటి సినిమాకే రామ్ చరణ్ వంటి హీరో, బుచ్చిబాబు వంటి దర్శకుడు దొరకడం నిజంగా ఆయన అదృష్టం. ఇక రామ్ చరణ్ డాన్స్ చూస్తుంటే మాటలు రావడం లేదు.. అంత అద్భుతమైన ఎనర్జీతో డాన్స్ చేశాడు. ‘పెద్ది’లో చరణ్ పర్ఫార్మెన్స్ ‘రంగస్థలం’లోని నటనను మించి నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. బుచ్చిబాబు, సతీష్‌లకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన రామ్ చరణ్‌కు థ్యాంక్యూ. ఇందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు థ్యాంక్యూ. జూన్ 4న హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ‘పెద్ది’ రిలీజ్ కాబోతోంది. హిందీలో జియో వారు భారీగా రిలీజ్ చేస్తున్నారు. ప్రేక్షకులు ‘పెద్ది’ సినిమాను సూపర్ హిట్ చేస్తారని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

తొక్కలో ఇంటర్వ్యూ.. అంటూ కుర్చీ విసిరేసి వెళ్లిపోయిన గెటప్ శ్రీను!

‘ఇద్దరి నుంచి ముగ్గురుగా’.. తల్లికాబోతోన్న శ్రీ విష్ణు హీరోయిన్!

‘భోగి’లో అనుపమ పరమేశ్వరన్.. ఫస్ట్ లుక్ మాములుగా లేదుగా!

కయాదు లోహర్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Updated Date - May 01 , 2026 | 09:10 PM

Peddi - Ram Charan:  పెద్ది కోసం రామ్ చరణ్ ఫిట్‌నెస్‌ మిషన్‌

Peddi First Shot: రామ్ చరణ్ చెప్పినట్టే ఫస్ట్ షాట్ అదిరింది

Peddi Song: ‘చికిరి’ పాట కోసం రెహమాన్‌ ఎవర్ని దింపారంటే..

Peddi : రెహమాన్ డప్పు.. రామ్ చరణ్ స్టెప్పు.. మోత మోగడమే

Peddi Action Sequence:రామ్ చరణ్ 'పెద్ది' రిస్క్..