Rajasekhar: సెట్ లో రాజశేఖర్ కి ప్రమాదం.. కాలికి తీవ్ర గాయం
ABN , Publish Date - Dec 08 , 2025 | 05:04 PM
యాంగ్రీ మ్యాన్ డా. రాజశేఖర్ (Rajasekhar) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Rajasekhar: యాంగ్రీ మ్యాన్ డా. రాజశేఖర్ (Rajasekhar) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ హీరోగా ఆయనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నారు. గత కొంతకాలంగా రాజశేఖర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెల్సిందే. వయస్సు పెరిగినా కూడా హీరోగా చేస్తూనే వస్తున్న ఆయన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో సపోర్టివ్ రోల్ లో కనిపించి మెప్పించాడు. అయితే ఈ సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తరువాత బైకర్ చిత్రంలో రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఒకపక్క సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే ఇంకోపక్క హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్యనే రాజశేఖర్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతుంది. తమిళ్ లో సూపర్ హిట్ అయిన లబ్బర్ పందు సినిమాను రాజశేఖర్ రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుందని సమాచారం. ఇక ఈ షూటింగ్ లోనే రాజశేఖర్ కి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆయన కాలికి తీవ్ర గాయం అయ్యింది. రాజశేఖర్ చీలమండలో క్రాక్స్ రావడంతో వెంటనే వైద్యులు ఆపరేషన్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, నాలుగు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట.
రాజశేఖర్ కి ప్రమాదం జరగడంతో సినిమా షూట్ ఆగిపోయింది. మళ్లీ తిరిగి జనవరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రంలో హీరోగా విశ్వదేవ్ రాచకొండ నటిస్తుండగా.. హీరోయిన్ గా రాజశేఖర్ కుమార్తె శివాని నటిస్తుంది. 27 ఏళ్ళ తరువాత రమ్యకృష్ణ.. రాజశేఖర్ కి జంటగా నటిస్తోంది. మరి ఈ సినిమాతో రాజశేఖర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.