Raja the Raja: రెండు జన్మల కథతో 'రాజా ది రాజా'

ABN , Publish Date - Jul 07 , 2026 | 09:55 AM

రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన 'రాజా ది రాజా' చిత్రం ఈ నెల 17న విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన చిత్రం 'రాజా ది రాజా'. అనిల్ బోయిడపు దర్శకత్వంలో కె. నిహారిక దాసరి నిర్మించిన ఈ చిత్రాన్ని కె. శ్రీలత రెడ్డి సమర్పిస్తున్నారు. జూలై 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నారు.

'రాజా ది రాజా' చిత్రం ట్రైలర్ ను సోమవారం హైదరాబాద్‌లో మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ, 'ఈ మధ్యకాలంలో ఈ సినిమా పేరు ఎక్కువగా వినిపించింది. ఈ సినిమా హీరో రుత్విక్ తో పాటు నిర్మాత నిహారిక కూడా చాలా ప్యాషన్ ఉన్న నిర్మాత. పాటలు అద్భుతంగా ఉన్నాయి. ఒక పెద్ద సినిమాలోని విజువల్స్‌లా అనిపిస్తున్నాయి. డైరెక్టర్ అనిల్ చాలా అద్భుతంగా మూవీ తీశాడు. హీరో రుత్విక్ కు మంచి భవిష్యత్తు ఉంది. రొమాన్స్, కామెడీ చేయడం చాలా కష్టం. చాలా టాలెంట్ ఉంటే గానీ ఆ ఎక్స్‌ప్రెషన్స్ రావు. ట్రైలర్‌లో చూస్తుంటే తనలో చాలా ఈజ్ కనిపించింది. నిహారిక క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడలేదు. ట్రైలర్ చూసిన తర్వాత టీమ్ అంతా చాలా మంచి సినిమా చేశారనే ఫీలింగ్ కలిగింది' అని అన్నారు.


హీరో రుత్విక్ మాట్లాడుతూ, 'ఈ సినిమాతో నేను నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాను. ఈ జర్నీ చాలా ఎమోషనల్. అనిల్‌తో కలిసి సినిమా చేయడం చాలా అద్భుతమైన అనుభూతి. ప్రేక్షకులను అలరించేలా ప్రతి సన్నివేశాన్ని తెరకెక్కించడానికి మేమంతా చాలా కష్టపడ్డాం. ప్రతి బ్రదర్‌కు నిహారిక లాంటి సిస్టర్ ఉండాలి. తనే నా బలం. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మైత్రి రవి గారికి, నవీన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు. సాయికుమార్ గారికి, నరేష్ గారికి, అవసరాల శ్రీనివాస్ గారికి, భద్రం గారికి, ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నరేష్ గారు, సాయికుమార్ గారు, మంజు భార్గవి మేడమ్‌తో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మా హీరోయిన్ విశాఖ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మా మ్యూజిక్ డైరెక్టర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మా టెక్నీషియన్స్ అందరికీ థాంక్యూ' అని అన్నారు.

raja song still.jpg

నిర్మాత నిహారిక దాసరి మాట్లాడుతూ, 'ఇది మాకు చాలా స్పెషల్ ఫిలిం. మా డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా సినిమా తీశారు. సినిమాలో నటించిన నటీనటులకు, టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. రుత్విక్, విశాఖ ఇద్దరూ అద్భుతంగా నటించారు. ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. తప్పకుండా ఈ సినిమాను థియేటర్లలో చూడండి' అని కోరారు. దర్శకుడు అనిల్ మాట్లాడుతూ, 'టీజర్ వచ్చినప్పటి నుంచి సినిమాకి చాలా మంచి పేరు వస్తోంది. పాటలకు కూడా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తొలి సినిమా ప్రతి దర్శకుడికి చాలా ప్రత్యేకం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాత నిహారిక గారికి, మా హీరో రుత్విక్ గారికి ధన్యవాదాలు. రుత్విక్ తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. ఆయన చాలా ప్యాషన్ ఉన్న నటుడు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు' అని అన్నారు. అమెరికాలో యాక్టింగ్ నేర్చుకుని వచ్చిన రుత్విక్ తన తొలి చిత్రంలోనే చాలా నటించాడని, కథపరంగా సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని, ఇది అందరికీ గుర్తిండిపోయే చిత్రమ'ని నటుడు అవసరాల శ్రీనివాస్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

సుమా, కమ్ టు మై రూమ్.. ఇదేం కామెడీ బ్రహ్మాజీ!

అంతా అతడిని ‘చింటు అన్నా’ అని పిలుస్తారట కదా..: నాగార్జున

‘లెనిన్’ కోసం గర్జించిన యంగ్ టైగర్.. ఫ్యాన్స్‌కు పండగే!

Madhavan: ఆ హీరోయిన్‌ని పెళ్లి చేసుకోవడమే నా గోల్

Updated Date - Jul 07 , 2026 | 10:00 AM