Madhavan: ఆ హీరోయిన్‌ని పెళ్లి చేసుకోవడమే నా గోల్

ABN , Publish Date - Jul 06 , 2026 | 04:37 PM

90వ దశకంలో బాలీవుడ్ ఇండస్ట్రీని తన క్యూట్ స్మైల్, అందమైన కళ్లతో ఊపేసిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డ్రీమ్ గర్ల్స్ జూహీ చావ్లా (Juhi Chawla) .

R Madhavan about Juhi Chawla

90వ దశకంలో బాలీవుడ్ ఇండస్ట్రీని తన క్యూట్ స్మైల్, అందమైన కళ్లతో ఊపేసిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డ్రీమ్ గర్ల్స్ జూహీ చావ్లా (Juhi Chawla) . సామాన్య ప్రేక్షకులే కాదు.. ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు సైతం ఆమె అందానికి దాసోహం అయ్యారు. తాజాగా సౌత్ టూ నార్త్ లేడీస్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న చాక్లెట్ బాయ్ ఆర్. మాధవన్ (R. Madhavan).. జూహీ చావ్లాపై తనకు ఉన్న ఒక క్రేజీ సీక్రెట్ క్రష్ గురించి బయటపెట్టాడు . ఒకానొక దశలో ఆమెను పెళ్లి చేసుకోవడమే తన జీవిత ఆశయంగా మార్చుకున్నానని మాధవన్ చెప్పుకొచ్చాడు.


' జూహీ బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా ఖయామత్ సే ఖయామత్ తక్ చూసిన తర్వాత ఆమె యాక్టింగ్‌కి, అందానికి నేను లిటరల్‌గా పడిపోయాను. ఆ సినిమా చూశాక ఎలాగైనా జూహీ చావ్లానే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయి.. ఆ విషయాన్ని అప్పట్లో మా అమ్మకు కూడా చెప్పాను. ఇంకా చెప్పాలంటే జూహీని పెళ్లి చేసుకోవడం అప్పట్లో నాకున్న ఏకైక లక్ష్యం' అని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత మాధవన్ కూడా పెద్ద స్టార్ అయ్యాడు. 1999 లో సరితను వివాహం చేసుకున్నాడు.


ఇక ఎన్నో ఏళ్ల తరువాత మాధవన్ కి తన క్రష్ జూహీతో నటించే ఛాన్స్ వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ది రైల్వే మెన్ సిరీస్ లో జూహీ ఒక కీలక పాత్రలో కనిపించింది. కానీ ఇక్కడే విచిత్రమైన ట్విస్ట్ ఏంటంటే.. ఒకే సిరీస్ లో నటించినప్పటికీ కథ డిమాండ్ కారణంగా వీళ్లిద్దరికీ కలిపి ఒక్క సీన్ కూడా లేదు. చివరికి సెట్స్‌లో కూడా వీరు కలుసుకోలేదట. మాధవన్ తన షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసి వెళ్ళిపోయిన తర్వాతే జూహీ చావ్లా షూటింగ్‌లో జాయిన్ అయ్యారట. ఈ విషయాన్ని మాధవన్ ది రైల్వే మెన్ ప్రమోషన్స్ సమయంలో స్వయంగా జూహీ చావ్లా ముందే షేర్ చేశాడు. అప్పటి విషయం ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Updated Date - Jul 06 , 2026 | 05:42 PM