సుమా, కమ్ టు మై రూమ్.. ఇదేం కామెడీ బ్రహ్మాజీ!

ABN , Publish Date - Jul 06 , 2026 | 11:42 PM

ఎటువంటి సందర్భంలోనైనా ఒక స్టేజ్‌ని నడిపించడంలో సుమది అందెవేసిన చేయి. ఈ విషయం టాలీవుడ్‌లో ఎవరిని అడిగినా చెబుతారు. తాజాగా అలాంటి ఘటనే మరోసారి చోటు చేసుకుంది. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక తిరుపతిలో గ్రాండ్‌గా జరిగింది.

Brahmaji and Suma

ఎటువంటి సందర్భంలోనైనా ఒక స్టేజ్‌ని నడిపించడంలో సుమది అందెవేసిన చేయి. ఈ విషయం టాలీవుడ్‌లో ఎవరిని అడిగినా చెబుతారు. తాజాగా అలాంటి ఘటనే మరోసారి చోటు చేసుకుంది. అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా నటించిన ‘లెనిన్’ (Lenin) చిత్ర ప్రీ రిలీజ్ వేడుక తిరుపతిలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో సుమ (Suma), బ్రహ్మాజీ (Brahmaji) మధ్య జరిగిన ఆసక్తికర, ఫన్నీ సంభాషణకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో ‘సుమ.. కమ్ టు మై రూమ్’ అంటూ ప్రభాస్ - ఓం రౌత్ మధ్య జరిగిన సన్నివేశాన్ని రీ క్రియేట్ చేశారు. ముందుగా బ్రహ్మాజీని స్టేజ్‌పైకి పిలుస్తూ..

‘‘ఈ సినిమాలో అందరికన్నా ఎవరైనా యంగెస్ట్ పర్సన్ యాక్ట్ చేశారు అంటే ఆయనే బ్రహ్మాజీ. ఆయన్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఆయన ఎలా చేయగలుగుతున్నారు అనేది అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మరి ఆ ఆశ్చర్యాన్ని పోగొట్టడానికి ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ద జెన్ జీ కుర్రాడు బ్రహ్మాజీ. నిజానికి మనం వికీపీడియాలో చూస్తే తప్పుగా కనిపిస్తూ ఉంటుంది. అక్కినేని నాగేశ్వరరావు కన్నా ఎక్కువగా వయసు ఉంది ఆయనకి అని. అది కాదు, ఇట్ ఇస్ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఒక్కొక్కసారి జురాసిక్ పార్క్ రిఫరెన్సెస్ కూడా వస్తూ ఉంటాయి బట్ అది కూడా తప్పు. మీరు ఆయన నడిచి వస్తున్న తీరు చూస్తూంటేనే అందరికీ అర్థమైపోతుంది.. ఆయన జన్ జీ అని. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ బ్రహ్మాజీ! మనం కింగ్ నాగార్జున గురించి అనుకుంటూ ఉంటాము జనరల్లీ మమ్మ మాస్, మమ్మం మాస్ అని, కానీ దిస్ ఇస్ ద జెన్ జీ బ్రహ్మాజీ! అర్జెంట్‌గా ఆయనకి కర్ర ఇవ్వండి.. సారీ మైక్ ఇవ్వండి’’ అని సుమ తన చతురతను ప్రదర్శించారు.


ఆ వెంటనే బ్రహ్మాజీ ఓ ఫ్లైట్‌పై బ్రహ్మాజీ కూర్చున్న ఫొటోని చూపించి.. బ్రహ్మజీ రీసెంట్‌గా కొనుక్కున్న ఒక అమూల్యమైన.. ఎస్ మీరు కరెక్ట్ గా చూస్తున్నారు, బ్రహ్మజీ చార్టెడ్ ఫ్లైట్ కొన్నారు! ఈ వేడుకకు ఆ ఫ్లైట్‌లోనే వచ్చారు వాళ్ళందరూ. అది గాలిలో ఉన్నప్పుడు ఆయన బయటకు వచ్చి దిగిన ఫోటో ఇది. ఇప్పుడు నాకు ఒక డౌట్.. పైలట్ వదిలేసి వచ్చి ఫోటో తీశాడా? ఎవరు తీశారు ఈ ఫోటో?’’ అని సుమ ప్రశ్నించగానే.. ‘‘సర్‌ప్రైజ్ అవుతారు చెప్తే! అమల గారు తీశారు.. అమల గారు!’’ అని బ్రహ్మాజీ కూడా తనలోని చతురతను ప్రదర్శించారు.


వెంటనే సుమ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఇక మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. ఇంకేం చెప్తారు.. అంటే మీరు అఖిల్ తమ్ముడుగా యాక్ట్ చేశారా? అఖిల్‌కి ఆపోజిట్‌గా పని చేశారా? క్యారెక్టర్ నేమ్ ఏమైనా రివీల్ చేయొచ్చా? చెప్పండి అని అనగానే.. ‘ఇందులో అఖిల్‌కు ఆపోజిట్ టీమ్‌లో నటించాను. ఇందులో నా పాత్ర పేరు కుంటి దామోదరం’ అని తన పాత్ర తాలుకూ తీరుని బ్రహ్మాజీ స్టేజ్‌పై ప్రదర్శించగానే.. ‘వావ్ బ్యూటిఫుల్. మీరు నటించాల్సిన అవసరం లేదు, జీవిస్తున్నారు’ అని సుమ అన్నారు. వెంటనే బ్రహ్మా.. ‘‘ఏయ్.. యా.. కమ్ టు మై రూమ్’’ అని బ్రహ్మాజీ అనగానే.. ‘అన్నయ్యా.. అది.. ఆ కమ్ టు మై.. అది గుర్తొచ్చిందా మీకు? ఓకే’ అంటూ ‘ఆదిపురుష్’ ఇన్సిడెంట్‌ని వారిద్దరూ గుర్తు చేసుకున్నారు. ఇలా వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణపై నెటిజన్లు కూడా ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి:

అంతా అతడిని ‘చింటు అన్నా’ అని పిలుస్తారట కదా..: నాగార్జున

‘లెనిన్’ కోసం గర్జించిన యంగ్ టైగర్.. ఫ్యాన్స్‌కు పండగే!

Madhavan: ఆ హీరోయిన్‌ని పెళ్లి చేసుకోవడమే నా గోల్

Updated Date - Jul 06 , 2026 | 11:42 PM