Raashii Khanna: సంతోషంలో కాదు.. కష్టాల్లో తోడుండేవారే అసలైన స్నేహితులు
ABN, Publish Date - Aug 02 , 2026 | 12:01 PM
'మనం సంతోషంగా ఉన్నట్లు నటించాల్సిన అవసరం లేని ఒకే ఒక్క ప్లాట్‌ఫామ్ ‘స్నేహం’ అని చెబుతున్నారు నటి రాశి ఖన్నా.
'మనం సంతోషంగా ఉన్నట్లు నటించాల్సిన అవసరం లేని ఒకే ఒక్క ప్లాట్‌ఫామ్ ‘స్నేహం’ అని చెబుతున్నారు నటి రాశి ఖన్నా(Raashii Khanna). అభివృద్ధి పరంగా ప్రపంచం ఎంత ముందుకు వెళ్లిన స్నేహానికి ఉన్న స్థానం ఎంతో ప్రత్యేకమని ఆమె అంటున్నారు. జీవితానికి నిజమైన స్నేహితులు ఒకరు ఉంటే చాలంటూ. స్నేహితుల దినోత్సవం సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
'మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఒక తోడు కావాలనుకుంటాం. మన బాధలను వారు ఓపికగా వినాలనుకుంటాం. అలాంటి స్నేహితులు ఉంటే... మనకు వాళ్లే మంచి ‘పిల్లర్’గా ఉంటారు. పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ అలాంటి క్షణాలు తప్పకుండా ఉంటాయి. మనం సంతోషంగా ఉన్నట్లు నటించాల్సిన అవసరం లేని ఒకే ఒక్క ప్లాట్‌ఫామ్ ‘స్నేహం’. ఎటువంటి ఈర్ష్య, అసూయ, పోటీ లేకుండా, ఎలాంటి తీర్పులు, విమర్శలు లేకుండా.. మన గెలుపును వారి గెలుపుగా భావిస్తూ, అలాగే మన కష్టకాలంలో వెన్నంటి నిలిచేవారే నిజమైన స్నేహితులు. అలాంటి నిజమైన స్నేహం ఎంతో విలువైనది. మన జీవితంలో ఎంతమంది మిత్రులున్నారనేది ముఖ్యం కాదు. కష్టాల్లో అండగా నిలిచే ఒక్క ఫ్రెండ్ ఉన్నా చాలు. జీవితం గందరగోళంగా మారినపుడు, బయటపడే మార్గం కనిపించనపుడు మన బలాన్ని, వ్యక్తిత్వాన్ని గుర్తు చేసి సరైన మార్గదర్శకత్వం చేసే తోడు ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. నా లైఫ్‌లో అలాంటి మంచి మిత్రులు వాణి, సావంత్.. ఉన్నందుకు నేను వారికి కృతజ్ఞతతో ఉంటాను. రెండు దశాబ్దాలుగా నాతో ఉంటూ నా ఎదుగుదలకు సహకరించారు. కష్టం అంటే వాణి,సావంత్‌లకు అర్ధరాత్రి కూడా ధైర్యంగా ఫోన్ చేయగలను. ఎందుకంటే వారు నా ఆనందంలో మాత్రమే కాదు. నా కష్టాల్లోనూ ఉంటారు. ఆ భరోసా మాకు ఇచ్చారు. పార్టీలు చేసుకోవడం వంటి ఆడంబరాలకు దూరంగా ఉంటాం. రుచికరమైన భోజనం చేయడం,ఎక్కువ సమయం గడపడం, క్షేమ సమాచారాలను తెలుసుకోవడం వంటి నిరాడంబరమైన విషయాలకే ఇంపార్టెన్స్ ఇస్తాం. ఖరీదైన గిఫ్ట్‌లు, పార్టీల కంటే ఒకరికొకరు తోడుగా నిలబడటమే అత్యంత ముఖ్యం అన్నట్లు ఉంటాం' అన్నారు.
ALSO READ:
Allu Arjun: స్టార్‌డమ్ మారినా.. స్నేహితులు మారలేదు.. అదే అల్లు అర్జున్!
‘కాక్‌టెయిల్ 2’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?