‘కాక్‌టెయిల్ 2’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ABN , Publish Date - Aug 02 , 2026 | 01:54 PM
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటించిన ‘కాక్‌టెయిల్ 2’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటించిన ‘కాక్‌టెయిల్ 2’ (Cocktail 2) ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. రష్మిక మందన్న, కృతి సనన్ కీలక పాత్రల్లో నటించారు. హోమీ అదజానియా దర్శకత్వంలో ట్రయాంగిల్ లవ్‌స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి రోజుల నుంచే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. 2026లో విడుదలైన హిందీ చిత్రాల్లో తొలి వారాంతంలో రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో ‘కాక్‌టెయిల్ 2’ కూడా చోటు దక్కించుకుంది. ఇప్పుడు డిజిటల్ వేదికపై సందడి చేసేందుకు రెడీ అవుతోంది. థియేటర్లలో సినిమా చూడలేకపోయిన ప్రేక్షకుల కోసం చిత్రబృందం ఓటీటీ రిలీజ్ తేదీని ప్రకటించింది. ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) ఆగస్టు 14 నుంచి ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.
కథ:
కునాల్ (షాహిద్ కపూర్), దియా (రష్మిక మందన్న) ప్రేమలో ఉన్న జంట. ఇద్దరూ చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉంటూ కలిసి జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటారు. మరోవైపు దియాకు అత్యంత సన్నిహిత స్నేహితురాలు యాలీ (కృతి సనన్). ఓ విదేశీ ట్రిప్‌లో యాలీకి కునాల్‌తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం క్రమంగా ఆకర్షణగా మారి, ఇద్దరి మధ్య ఊహించని పరిణామాలకు దారి తీస్తుంది.
అయితే ఈ సంఘటనను ఒక పొరపాటుగా భావించిన కునాల్ తిరిగి దియాతో తన జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంటాడు. ఇద్దరి పెళ్లి కూడా ఖరారవుతుంది. కానీ యాలీ మాత్రం కునాల్‌పై తన ప్రేమను మరచిపోలేకపోతుంది. చివరకు తన మనసులోని భావాలను దియా ముందే నిజాయితీగా వెల్లడిస్తుంది. దీంతో ముగ్గురి జీవితాలు అనూహ్య మలుపు తిరుగుతాయి.
కునాల్ నిజంగా ఎవరిని ప్రేమించాడు? దియాతో అతని బంధం ఎలాంటి పరీక్షను ఎదుర్కొంది? తన స్నేహితురాలి ప్రేమను తెలుసుకున్న తర్వాత దియా ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ప్రేమ, స్నేహం, నమ్మకం మధ్య ఈ ముగ్గురి ప్రయాణం ఎలాంటి ముగింపుకు చేరింది? చివరకు కునాల్ ఎవరిని జీవిత భాగస్వామిగా ఎంచుకున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే 'కాక్‌టెయిల్ 2' సినిమా.
ALSO READ:
Allu Arjun: స్టార్‌డమ్ మారినా.. స్నేహితులు మారలేదు.. అదే అల్లు అర్జున్!
Raashii Khanna: సంతోషంలో కాదు.. కష్టాల్లో తోడుండేవారే అసలైన స్నేహితులు