గన్ పట్టిన రాధ్య.. ‘ది రెడ్ బ్యాగ్’ హీరోయిన్ లుక్!
ABN , Publish Date - May 28 , 2026 | 10:20 PM
ప్రస్తుతం ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా వైవిధ్యభరితమైన చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్‌తో రూపుదిద్దుకుంటోన్న ‘ది రెడ్ బ్యాగ్’ చిత్రం నుంచి హీరోయిన్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.
ప్రస్తుతం ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా వైవిధ్యభరితమైన చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్‌తో నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి తన మెమరీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’ (The Red Bag). ఒక బ్యాగ్ చుట్టూ తిరిగే ఈ మూవీకి రవి కుమార్ సీరపు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బదల్, భార్గవి తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు.. సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాయి. రీసెంట్‌గా రాశీ (Raasi) పాత్రకు సంబంధించిన పోస్టర్ సినిమాపై మరింతగా ఆసక్తిని క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ హీరోయిన్ లుక్‌ని మేకర్స్ పరిచయం చేశారు.
హీరోయిన్ రాధ్య (Raadhya) ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదిలిన మేకర్స్.. ఈ పోస్టర్‌తోనే ఆమె పాత్ర తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయో క్లారిటీ ఇచ్చేశారు. ఇందులో ఆమెను చూపించిన తీరు, గన్ను పట్టుకున్న విధానం, చేతిలో ఉన్న ఆ వస్తువు.. ఇలా అన్నీ కూడా బాగా హైలెట్ అవుతున్నాయి. పవర్ ఫుల్ లుక్‌లో ఆమెని ప్రజంట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతోంది. ఇదే అప్డేట్‌లో ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు. తొలి సినిమానే అయినప్పటికీ, నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ టీజర్‌ని రిలీజ్ చేస్తామని, టీజర్‌తో అందరికీ ఈ సినిమాపై ఓ క్లారిటీ వస్తుందని నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ఆడియో జ్యూక్ బాక్స్ విడుదల.. ‘పెద్ది’ టీమ్ తప్పు చేసిందా?
యూపీలో పౌల్ట్రీ బిజినెస్.. భూమి పూజతోనే బండ్ల గణేష్ పరార్.. ఎందుకంటే?
‘అమ్మ’కు ఏమైంది? మరో సీనియర్ నటి సంచలన ఆరోపణలు!