సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పూరి-సేతుపతి ‘స్లమ్ డాగ్’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ABN, Publish Date - Jun 05 , 2026 | 09:06 PM

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి కాంబోలో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్-డ్రామా ‘స్లమ్ డాగ్’. ‘33 టెంపుల్ రోడ్’ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్ర టీజర్ రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించారు.

Slum Dog Movie Still

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh), వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కాంబోలో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్-డ్రామా ‘స్లమ్ డాగ్’ (Slum Dog). ‘33 టెంపుల్ రోడ్’ అనేది ట్యాగ్‌లైన్. షూటింగ్ పూర్తి చేసుకుని, విడుదలయ్యే అన్ని భాషల వెర్షన్లలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఓ క్రేజీ అప్డేట్‌ను ఇచ్చారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలకు సంబంధించిన అప్డేట్‌ని (Slum Dog Teaser Update) మేకర్స్ వదిలారు.


‘స్లమ్ డాగ్’ మూవీ టీజర్‌ను జూన్ 8న విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ నిర్మాతలు అధికారికంగా ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ టీజర్ రిలీజ్ డేట్ పోస్టర్‌లో కనిపించిన విజువల్ ఎంతో డార్క్ అండ్ ఇంటెన్స్‌గా ఉండి, సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇందులో కళ్లకు గంతలు కట్టుకున్న ఓ వ్యక్తి, మెడపై రక్తంతో తడిసిన కత్తిని పట్టుకుని ఉన్నారు. ఆ వ్యక్తి ఫేస్ చూపించకుండా, బ్యాక్‌సైడ్ చూపించారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు.. వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి. ఈ పోస్టర్ కథలోని బ్రూటల్ ప్రపంచాన్ని సూచిస్తోంది. టీజర్ కోసం ఈ పోస్టర్ వెయిట్ చేసేలా చేస్తోందంటే అతిశయోక్తి కానే కాదు.


విజయ్ సేతుపతికి జోడీగా సంయుక్త నటిస్తుండగా.. టబు, కన్నడ స్టార్ దునియా విజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ వంటివారు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాలతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న జాతీయ అవార్డు విజేత హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పూరి కనెక్ట్స్, జె.బి. మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, జె.బి. నారాయణరావు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి:

‘పెద్ది’ పాత్రను ఎగతాళి చేసే వాళ్లంతా.. ముందు ఇది తెలుసుకోండి!

పవన్ కళ్యాణ్‌ని ‘దొర’ అంటావా.. ప్రకాశ్ రాజ్‌కి ఇచ్చిపడేసిన హేమ!

మీరు నిజంగానే పోరాడారు.. ‘పెద్ది’పై పవన్ కళ్యాణ్ బ్యానర్ పోస్ట్!

Updated Date - Jun 05 , 2026 | 09:06 PM