SlumDog Teaser: పూరి ఈజ్ బ్యాక్.. అదిరిపోయిన స్లమ్‌డాగ్ టీజర్
ABN, Publish Date - Jun 08 , 2026 | 08:15 PM
గత కొంతకాలంగా డేరింగ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కి సరైన హిట్ లేదు. అయినా సరే పూరి ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే ఆయన దర్శకత్వం వహించిన తాజాగా చిత్రం స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్ (SlumDog - 33 Temple Road).
గత కొంతకాలంగా డేరింగ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కి సరైన హిట్ లేదు. అయినా సరే పూరి ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే ఆయన దర్శకత్వం వహించిన తాజాగా చిత్రం స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్ (SlumDog - 33 Temple Road). కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటించగా.. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, జె.బి నారాయణరావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా స్లమ్‌డాగ్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సరైన హిట్ కోసం చూస్తున్న పూరి జగన్నాథ్, ఈ చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర గట్టి కంబ్యాక్ ఇవ్వబోతున్నట్లు టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. 'ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కొనే జీవితాలు మావి.. అలాంటి మా బతుకులతో ఆడుకుంటే నిన్ను ఎందుకు వదులుతాం' అంటూ సేతుపతి చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలయ్యింది. కళ్ళు లేని బెగ్గర్ గా విజయ్ సేతుపతి కనిపించాడు. ఇక తమ పని ఏదో తాము చూసుకొనే వారిపై రౌడీలు ఎందుకు కక్ష కట్టారు. వారిని అంతం చేయడానికి హీరో ఏం చేశాడు.. ? మధ్యలోకి పోలీసులు ఎందుకు వచ్చారు.. ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
పూరి ఈసారి టీజర్ లోనే కథను రివీల్ చేశాడు. తన ప్రపంచాన్ని నాశనం చేయడానికి వచ్చినవారిపై గుడ్డివాడైన బెగ్గర్ ఎలా పగ తీర్చుకున్నాడు.. ? దానికోసం ఏం చేశాడు అనేది స్టోరీ లైన్ గా తెలుస్తోంది. పోలీసాఫీసర్ గా టబు చాలా చక్కగా సరిపోయింది. బెగ్గర్ అయినా కూడా విజయ్ సేతుపతి లుక్ ని చాలా బాగా డిజైన్ చేశాడు పూరి. ఇక సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ హైలైట్ గా నిలవనుంది తెలుస్తోంది. టీజర్ లో తెలుగు, ఇంగ్లీష్ మిక్స్ అయిన ర్యాప్ ఆకట్టుకుంటుంది. మొత్తానికి టీజర్ తోనే సినిమాపై హైప్ తీసుకొచ్చాడు పూరి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో పూరి కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.