సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

విశ్వంతో తత్వం బోధపడింది.. బా బా బ్లాక్ షీప్ నిర్మాత వేణు దోనేపూడి

ABN, Publish Date - Oct 13 , 2026 | 08:48 AM

‘బా బా బ్లాక్ షీప్’ నిర్మాత వేణు దోనేపూడి సినిమా విజయంపై స్పందించారు. ‘విశ్వం’తో ఎదురైన అనుభవాలు, నవంబర్ 6 నుంచి అమెజాన్‌లో సినిమా స్ట్రీమింగ్, తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రామం’, తదుపరి చిత్రాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

నిర్మాత వేణు దోనేపూడి తాజా చిత్రం ' బా బా బ్లాక్‌ షీప్‌' ఇటీవల విడుదలైంది. గుణి మంచికంటి దర్శకత్వంలో పూర్తిగా మేఘాలయాలో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని నిర్మాత వేణు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 150 థియేటర్లులో, నార్త్ లో వంద థియేటర్లలో ఈ సినిమా విడుదలైందని, ఓవర్సీస్‌లోనూ రిలీజ్‌ చేశామని ఆయన తెలిపారు. అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయ్యిందని, ఓటీటీ డీల్‌ కూడా ముగిసిందని చెప్పారు. నవంబర్ 6న నుంచి ఈ సినిమా అమెజాన్‌లో స్ట్రీమింగ్‌ అవుతుందని అన్నారు.

తన సినిమా ప్రయాణం గురించి చెబుతూ, 'మా తాత గారు థియేటర్ నడిపించేవారు. మా నాన్న గారు థియేటర్‌ను కొన్నేళ్ల క్రితమే క్లోజ్ చేశారు. సినీ రంగంతో మా ఫ్యామిలీకి పరిచయం ఉంది. 90వ దశకంలో యూఎస్‌లో ఆటో మొబైల్ బిజినెస్ చేశాను. అక్కడే డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ కూడా చేశాను. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్ ఇలా అన్ని దేశాల్లో సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేశాను. 2008లో నేను ఇండియాకి వచ్చాను. అక్కినేని నాగేశ్వరరావు గారిని నేను తాతగారు అని పిలిచేవాడిని. అన్నపూర్ణ బ్యానర్‌తోనే ఇండస్ట్రీకి పరిచయమవ్వు అని ఆయన అన్నారు. అప్పుడు ‘మనం’ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. నేను కూడా ‘మనం’ సినిమాలో వెనకాల ఎక్కడో కనిపిస్తాను. మా తాతగారి కల నిజం చేసేందుకు నేను రైటింగ్‌ కూడా స్టార్ట్ చేశాను. అలా 'విశ్వం' సినిమాతో నా అసలు జర్నీ మొదలైంది. అప్పుడే గోపీ మోహన్, శ్రీను వైట్ల పరిచయం అయ్యారు. అతి మంచితనం పనికి రాదు అని ఆ ప్రయాణంలో తెలిసింది. కో ప్రొడ్యూసర్స్‌గా వచ్చిన వారు ఒరిజినల్ ప్రొడ్యూసర్స్‌గా ప్రవర్తించారు. షూటింగ్ పూర్తికాక ముందే అన్ని రకాల బిజినెస్‌లు క్లోజ్ అయ్యాయి. కానీ ఆ తర్వాత సమస్యలు వచ్చాయి. లీగల్ చర్యలు తీసుకున్నాం. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోంది. మొత్తం మీద 'విశ్వం'తో నాకు తత్వం బోధపడింది. అయితే ఫిల్మ్ ఛాంబర్‌ వల్ల 'విశ్వం' సినిమా విషయంలో కాస్త సేఫ్‌ అయ్యాను' అని చెప్పారు.


తన తదుపరి ప్రాజెక్ట్ గురించి వేణు వివరిస్తూ, '‘రామం’ నా డ్రీమ్ ప్రాజెక్ట్. అద్భుతమైన కథతో సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నాం. మూల కథను వీఎన్ ఆదిత్య గారు ఇచ్చారు. భారీ బడ్జెట్ చిత్రాన్ని కూడా కంట్రోల్డ్ బడ్జెట్‌లో చేయొచ్చని ‘రామం’తో నిరూపిస్తాను. ‘గాంధీతాత చెట్టు’ దర్శకురాలు పద్మావతి మల్లాదితో ఓ ప్రేమ కథా చిత్రాన్ని చేస్తున్నాను. మరో రెండు సినిమాల్ని పెద్ద హీరోలతో చేస్తున్నాను. వాటికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వస్తుంది' అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

ఊటీలో ‘జనవరి 12 విడుదల’ టీమ్.. సంక్రాంతికి బాక్సాఫీస్ బద్దలే

‘వారణాసి’లో రామాయణ ఘట్టంపై జక్కన్న సంచలన వ్యాఖ్యలు

30 ఏళ్ల సినీ ప్రయాణం.. పవర్ స్టార్‌కు అల్లు అరవింద్ అభినందనలు

Updated Date - Oct 13 , 2026 | 08:53 AM