సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పవన్ తో సినిమా.. కన్ఫర్మ్ చేసిన దిల్ రాజు

ABN, Publish Date - Nov 13 , 2026 | 06:19 PM

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) చాలా కాలం తరువాత మీడియా ముందుకు వచ్చారు. ఒకప్పుడు ప్రతి సినిమా సక్సెస్ మీట్ లో కనిపించే ఆయన ఈమధ్య అస్సలు కనిపించడం మానేశారు.

Dil Raju

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) చాలా కాలం తరువాత మీడియా ముందుకు వచ్చారు. ఒకప్పుడు ప్రతి సినిమా సక్సెస్ మీట్ లో కనిపించే ఆయన ఈమధ్య అస్సలు కనిపించడం మానేశారు. తాజాగా రామాయణ రూ.1000 కోట్లు సాధించి రికార్డు సృష్టించడంతో ఆయన ఒక్కరే ప్రెస్ మీట్ ని నిర్వహించి వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇక ఈ ప్రెస్ మీట్ లో దిల్ రాజు.. పవన్ కళ్యాణ్ తో సినిమాని కన్ఫర్మ్ చేయడంతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న విషయం తెల్సిందే. ఓజీ తరువాత ఆయనను వెండితెరపై చూడలేమో అనుకున్న సమయంలో డైరెక్టర్ సుజీత్ ఓజీ 2 ని ప్రకటించి అందరి మనసులను తేలికచేశాడు.


ఇక గత కొన్నిరోజుల నుంచి దిల్ రాజు నిర్మాణంలో పవన్ ఒక సినిమా చేస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెల్సిందే. వకీల్ సాబ్ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుందనే వార్తలు రావడంతో ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. ఈమధ్యన పవన్ కళ్యాణ్ ని కలిశారు ఏంటి సంగతి అని అడగ్గా దిల్ రాజు మాట్లాడుతూ.. 'వీలుంటే సినిమా చేద్దామని కలిశాను. వకీల్ సాబ్ సినిమా తర్వాత ఆయనతో మరో అద్భుతమైన సినిమా తీయాలనే నా ఇంటెన్షన్ ఉంది. అందుకే దానికి తగినట్లుగా అడుగులు వేస్తున్నాను" అని తెలిపారు. అంతేకాకుండా 2027లో అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నాను.


అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుందనే దానిపై స్పష్టతనిస్తూ.. 'అన్నీ ప్రాపర్‌గా సెట్ అయి, స్క్రిప్ట్ లేదా వర్కవుట్ ఎలా షేప్ అవుతుందనేది క్లారిటీ వచ్చాక వందశాతం నేనే స్వయంగా అఫీషియల్ ఇన్‌ఫార్మ్ చేస్తాను.. ఏదో ఉంది కదా అని ముందుగానే చెప్పుకుంటూ వెళ్లలేను' అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే, గతంలో సంక్రాంతికి వరుస హిట్లు కొట్టి సంక్రాంతి రాజుగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు, ఇటీవల దీపావళికి కూడా రెండు సినిమాలతో ఘన విజయాలను సొంతం చేసుకున్నారు. సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌లు, ఫెయిల్యూర్స్, ట్యాగ్స్‌ అన్నీ తాత్కాలికమేనని, మంచి కంటెంట్‌తో సినిమాలు తీయడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ కాంబో ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

Updated Date - Nov 13 , 2026 | 07:15 PM