సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఇరుముడి హీరోయిన్ లుక్ వచ్చేసింది..

ABN, Publish Date - Feb 15 , 2026 | 02:18 PM

మాస్ మహారాజా రవితేజ  హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఇరుముడి' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రవితేజకు ఇది 77వ సినిమా. 

మాస్ మహారాజా రవితేజ (Raviteja) హీరోగా శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో 'ఇరుముడి' (Irumudi) చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రవితేజకు ఇది 77వ సినిమా. మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో దీనిని నిర్మిస్తోంది. ఇటీవల రవితేజ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఆదివారం మహా శివరాత్రి శుభ సందర్భంగా హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani shankar) ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె కావేరి పాత్రలో కనిపించనుంది. రవితేజ రగ్గడ్ లుక్‌లో ఆమె చెంపపై ప్రేమగా ముద్దుపెడుతూ కనిపించగా, ఇద్దరి మధ్య ఉన్న ఇంటెన్స్ ను చూపిస్తోంది. ఈ లుక్ ను బట్టి చూస్తే గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమాలాగా  అనిపిస్తోంది.

శివ నిర్వాణ ఇంటెన్స్, ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో పవర్ ఫుల్ కథని సిద్ధం చేశారు. ముఖ్యంగా తండ్రి–కూతురు అనుబంధం ఈ చిత్రానికి హైలెట్ గా ఉండబోతుంది. రవితేజ గత సినిమాలకంటే భిన్నంగా  కొత్త ఎమోషనల్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించబోతున్నారు. బేబీ నక్షత్ర రవితేజ కుమార్తెగా నటిస్తుండగా, సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, స్వాసిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ‘ఇరుముడి’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. 

Updated Date - Feb 16 , 2026 | 11:31 AM