సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రాజమౌళి సినిమాలో నటిస్తూనే.. 9 చిత్రాలు పూర్తి చేసిన హీరో!

ABN, Publish Date - Sep 14 , 2026 | 10:24 PM

‘వారణాసి’ ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనప్పటి నుంచి తన పార్ట్ షూటింగ్ ముగిసే లోపు, పృథ్విరాజ్ నటుడిగా, దర్శకుడిగా ఏకంగా 9 ప్రాజెక్టులను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారట.

Rajamouli and Prithviraj Sukumaran

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli).. భారతీయ సినిమా రూపురేఖలను మార్చేసి, టాలీవుడ్ సినిమా స్థాయిని ప్రపంచ నలుమూలలకీ చాటిచెప్పిన దార్శనికుడు. జక్కన్న సినిమా అంటేనే మైండ్ బ్లోయింగ్ విజువల్స్, కొన్నేళ్ల కష్టం, అత్యంత కచ్చితమైన ప్రణాళిక. ఆయన దర్శకత్వంలో ఒక్క సినిమా ఒప్పేసుకుంటే చాలు.. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు హీరోలు గానీ, ఇతర నటులు గానీ మరో సినిమా వైపు చూడటం దాదాపు అసాధ్యం. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి అగ్ర కథానాయకులు సైతం రాజమౌళి సినిమాల కోసం ఏళ్ల తరబడి వేచి చూసిన విషయం తెలియంది కాదు.

కానీ, ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu)-రాజమౌళి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (Varanasi) విషయంలో ఒక స్టార్ యాక్టర్ జక్కన్న రూల్ బుక్‌నే తిరగరాశారు. ఆయనే మాలీవుడ్ వర్సటైల్ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ అంశాలతో ఫారెస్ట్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతోన్న ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లో పృథ్విరాజ్ ఒక అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ సినిమాలో పృథ్విరాజ్ సుకుమారన్‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయిందట.


ఇక్కడ అసలైన సెన్సేషన్ ఏంటంటే.. ‘వారణాసి’ ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనప్పటి నుంచి తన పార్ట్ షూటింగ్ ముగిసే లోపు, పృథ్విరాజ్ నటుడిగా, దర్శకుడిగా ఏకంగా 9 ప్రాజెక్టులను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారట. సాధారణంగా రాజమౌళి సెట్‌లోకి అడుగుపెట్టిన నటులు వేరే ప్రాజెక్ట్‌లకు టైమ్ కేటాయించడం చాలా అరుదు. అలాంటిది ‘వారణాసి’ లాంటి భారీ ప్రొడక్షన్ షెడ్యూల్స్‌కు ఎలాంటి ఆటంకం కలగకుండా, తన రోల్‌కు పూర్తి న్యాయం చేస్తూనే.. మరోవైపు వరుసగా 9 సినిమాలు పూర్తి చేయడం పృథ్విరాజ్ కెరీర్‌లోనే ఒక అరుదైన, ఆశ్చర్యపరిచే రికార్డు అని సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.


ఇక ‘వారణాసి’ విషయానికి వస్తే.. ఇప్పటికే సుమారు 90 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ గ్లోబల్ ప్రాజెక్ట్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు ద్విపాత్రాభినయంతో రచ్చ చేయబోతున్నారు. ఒక పాత్రలో ‘రుద్ర’గా, మరో పాత్రలో ‘శ్రీరాముడు’గా మహేష్ కనిపించనున్నారనే వార్త అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. ఈ రెండు వైవిధ్యమైన పాత్రల కోసం మహేష్ బాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఎంతగానో శ్రమిస్తున్నారు. ఇక గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుండగా.. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా రూ. 1300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ విజువల్ వండర్ వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. రాజమౌళి విజన్, మహేష్ బాబు కరిష్మా, పృథ్విరాజ్ సుకుమారన్ నటన కలగలసిన ఈ ‘వారణాసి’ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య చేసే రోల్ ఇదేనా?

చిన్ని ప్రాణానికి ఎప్పటికీ కృతజ్ఞురాలిని.. సమంత సీమంతం పోస్ట్ వైరల్

36 రోజుల్లో మూడు సినిమాలు.. విశ్వక్ ఏందయ్యా ఈ స్పీడ్!

Updated Date - Sep 14 , 2026 | 10:41 PM