36 రోజుల్లో మూడు సినిమాలు.. విశ్వక్ ఏందయ్యా ఈ స్పీడ్!

ABN , Publish Date - Sep 14 , 2026 | 07:54 PM

‘ఫలక్‌నుమా దాస్’ సినిమాతో హీరోగా, దర్శకుడిగా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోవడమే కాకుండా, ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వశక్తితో టాలీవుడ్‌లో తిరుగులేని మాస్ ఫ్యాన్ బేస్‌ను హీరో విశ్వక్ సేన్ సంపాదించుకున్నారు.

Vishwak Sen upcoming films

మాస్ అండ్ రా ఎనర్జీతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ సెట్ చేసుకున్న నటుడు విశ్వక్ సేన్ (Vishwak Sen). ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాతో హీరోగా, దర్శకుడిగా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోవడమే కాకుండా, ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వశక్తితో టాలీవుడ్‌లో తిరుగులేని మాస్ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు. హీరోగా మాత్రమే కాకుండా రైటర్‌గా, డైరెక్టర్‌గా మల్టీ టాలెంట్ చూపిస్తున్న ఈ యంగ్ హీరోకి ఇటీవల సరైన హిట్ పడలేదు. గత ఏడాది వచ్చిన ‘లైలా’, ఈ ఏడాది వచ్చిన ‘ఫంకీ’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. అయితే ఈ ఫలితాలతో సంబంధం లేకుండా విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఈసారి ఏకంగా కేవలం 36 రోజుల వ్యవధిలో 3 డిఫరెంట్ జానర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ లైనప్‌లో ముందుగా రాబోతున్న చిత్రం ‘కల్ట్’ (Cult). ‘ఫలక్‌నుమా దాస్, దాస్ కా దమ్కీ’ సినిమాల తర్వాత విశ్వక్ సేన్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమాలో గాయత్రి భరద్వాజ్ కథానాయికగా నటిస్తోంది. ఇక ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ అందిస్తున్న మ్యూజిక్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ కానుంది. విశ్వక్ డైరెక్షన్‌లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 30న థియేటర్లలోకి రానుంది.


ఇక ‘కల్ట్’ ఇచ్చిన మాస్ వైబ్స్ నుంచి బయటపడకముందే... నవంబర్ 19న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ (ENE Repeat) రాబోతోంది. సెన్సేషనల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఐకానిక్ హిట్ ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి ఇది సీక్వెల్. ఫ్రెండ్‌షిప్, కామెడీ నేపథ్యంతో రానున్న ఈ మూవీపై యూత్ అండ్ ఆడియన్స్‌లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కల్ట్’ వచ్చిన కొద్ది రోజులకే ఈ సినిమా విడుదల కావడం విశేషం.


ఇక ఈ ట్రిపుల్ రష్‌లో మూడో చిత్రం ‘లెగసీ’ (Legacy). ‘పిండం’ సినిమాతో డిఫరెంట్ మేకింగ్‌తో ఆకట్టుకున్న దర్శకుడు సాయికిరణ్ రెడ్డి ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు. విశ్వక్ సేన్ జోడీగా ఏక్తా రాథోడ్ నటిస్తున్న ఈ పొలిటికల్ డ్రామా డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేని మూడు పూర్తి భిన్నమైన జానర్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడానికి మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రెడీ అయిపోయారు. మరి 36 రోజుల వ్యవధిలో రాబోతున్న ఈ మూడు విభిన్నమైన సినిమాల్లో... విశ్వక్ సేన్‌కు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ బ్రేక్ ఇచ్చే సినిమా ఏదవుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

‘జెన్ జీ’ నాడి పట్టుకోవడం బ్రహ్మవిద్యా.. మరి ఇదేంటి?

చిరంజీవి - శ్రీకాంత్ ఓదెల కాంబో మూవీ.. స్టార్ట్ అయ్యేది అప్పుడేనా?

‘దేవర 2’కి బ్రేక్.. త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ 600 కోట్ల పౌరాణిక విస్ఫోటనం!

Updated Date - Sep 14 , 2026 | 07:54 PM