అక్టోబర్ 2న ‘ప్రేమనే ఊరిలో’
ABN , Publish Date - Sep 26 , 2026 | 05:20 PM
'ప్రేమనే ఊరిలో' చిత్రం కన్నడలో శుక్రవారం విడుదలైంది. అయితే తెలుగులో ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు.
చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 'కేజీఎఫ్, కాంతారా' వంటి చిత్రాలకు డైలాగ్స్ అందించిన హనుమాన్ చౌదరి ఈ చిత్రానికి సంభాషణలు రాయగా ప్రముఖ గేయ రచయిత రాంబాబు గోసాల పాటలను రచించారు. సునద్ గౌతమ్ సంగీతం అందిస్తుండగా, రాజ్‌కాంత్ ఎస్.కె సినిమాటోగ్రఫీ, హర్షిత్ ప్రభు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.
సెప్టెంబర్ 25న కన్నడలో విడుదలైన ఈ చిత్రానికి అనూహ్య స్పందన లభించగా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన తెలుగులో విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. కర్ణాటకలో హౌస్ ఫుల్ అవుతున్న ఈ ప్రేమ కథ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా అదేవిధంగా ఆదరిస్తారని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పాటలకు, ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
‘సిగ్మా’ అంటే ఏంటో గూగుల్ చేశా.. ఫస్ట్ కాపీ నాకే చూపించాలి: చిరంజీవి
ఇక నో డౌట్.. ‘రణబాలి’ వచ్చేది ఫిక్స్.. న్యూ పోస్టర్ వైరల్
సల్మాన్ ఖాన్ ‘మాన్‌స్టర్’.. మైండ్ బ్లోయింగ్ డీల్!