కన్నడ నుంచి తెలుగులోకి 'ప్రేమనే ఊరిలో...'
ABN , Publish Date - Sep 15 , 2026 | 12:23 PM
కన్నడ అనువాద చిత్రం 'ప్రేమనే ఊరిలో' ఈ నెల 25న విడుదల కాబోతోంది. మనోజ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
కన్నడంలో రూపుదిద్దుకున్న 'ప్రేమద ఊరలి' చిత్రం ఈ నెల 25న జనం ముందుకు రాబోతోంది. అదే సినిమాను 'ప్రేమనే ఊరిలో' పేరుతో తెలుగులోనూ డబ్ చేసి అదే రోజున గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు మనోజ్ కుమార్ కథ, కథనం అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. దీనిని చందు శ్రీనివాస్, సురేశ్ కొండేటి, మమత దేవేంద్ర ఎం తెలుగువారి ముందుకు తీసుకొస్తున్నారు.
ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన సురేశ్ కొండేటి మాట్లాడుతూ, 'కన్నడ సినిమా టీజర్ చూసిన తర్వాత ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేయాలనే కోరిక కలిగింది. స్వచ్ఛమైన పల్లెటూరికి చెందిన ప్రేమకథ ఇది. అనుబంధాలు, ఆత్మీయతలకు పెద్ద పీట వేసిన చిత్రం. ఈ మూవీ టీజర్ కు శ్రీకాంత్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. దీనిని తనికెళ్ళ భరణి గారు విడుదల చేశారు. అలానే ఇప్పటికే విడుదలైన లిరికల్ వీడియోలకూ మంచి స్పందన లభిస్తోంది. నాన్న మీద గతంలో కొన్ని సినిమాలు వచ్చినా... ఇది వాటిని మించి ఉంటుంది. 'కె.జి.ఎఫ్., కాంతారా' చిత్రాలకు మాటలు రాసిన హనుమాన్ చౌదరి ఈ సినిమాకు తెలుగు సంభాషణలు అందించారు. రాంబాబు గోసాల అర్థవంతమైన సాహిత్యాన్ని ఇచ్చారు. సునద్ గౌతమ్ బాణీలు అందరినీ అలరిస్తున్నాయి. సినిమా కూడా తప్పకుండా చక్కని విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని అన్నారు. అయితే... 'ప్రేమనే ఊరిలో' చిత్రానికి తెలుగులో 'ది ప్యారడైజ్' నుంచి, ఆంగ్ల చిత్రం 'అవెంజర్స్ ఎండ్ గేమ్' నుంచి గట్టి పోటీ ఎదురుకాబోతోంది.
ఇవి కూడా చదవండి!
చిన్ని ప్రాణానికి ఎప్పటికీ కృతజ్ఞురాలిని.. సమంత సీమంతం పోస్ట్ వైరల్
పావలా శ్యామల కూతురికి 'మా' చేదోడు!
36 రోజుల్లో మూడు సినిమాలు.. విశ్వక్ ఏందయ్యా ఈ స్పీడ్!