సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రిషిల్ – శేఖర్ మాస్టర్ కలయికలో...

ABN, Publish Date - Mar 16 , 2026 | 06:43 PM

ఫిల్మ్ ఇండస్ట్రీలోకి మరో వారసుడు రాబోతున్నాడు. అయితే ఈసారి ఎవరూ ఊహించని వ్యక్తి తనయుడు చిత్రసీమలో అడుగు పెడుతున్నాడు. మరో విశేషం ఏమంటే... ఎవరూ ఊహించని వ్యక్తి ఈ వారసుడిని పరిచయం చేయబోతున్నాడు.

ఇప్పటి దాకా ప్రముఖ నటుడు, దర్శక నిర్మాతల వారసులు ఇండస్ట్రీలోకి రావడాన్ని చూశాం. ఫలితాలు ఎలా ఉన్నా.. చాలా మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే ఇప్పుడు అలాంటి వారసత్వానికి ఓ డాన్స్ మాస్టర్స్ ఫ్యామిలీలోని మూడో తరం సిద్ధమౌతోంది. 'ఇండియన్ మైఖేల్ జాక్సన్' ప్రభుదేవా కుమారుడు రిషిల్ రాఘవేంద్ర దేవా త్వరలోనే హీరోగా రంగ ప్రవేశం చేయబోతున్నాడు.


ప్రముఖ నృత్య దర్శకుడు సుందరం మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన ముగ్గురు కొడుకుల్లో ప్రభుదేవా, రాజు సుందరం డాన్స్ మాస్టర్స్ అయ్యారు. ప్రభుదేవా నటుడిగా, దర్శకుడిగా మారి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అలానే రాజు సుందరం స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఎదిగారు. ఇక మరో కుమారుడు నాగేంద్ర సినిమాల్లో నటించాడు. విశేషం ఏమంటే ఈ ముగ్గురు కలిసి '123' అనే మూవీలో చేశారు. ఇక విషయానికి వస్తే... ఇప్పుడు ప్రభుదేవా కొడుకు రిషిల్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. చూడటానికి అచ్చం తండ్రిలానే ఉండే రిషిల్‌ను వెండితెరకు పరిచయం చేస్తోంది వేరెవరో కాదు స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్! ఇవాళ తెలుగులో శేఖర్ మాస్టర్ టాప్ పొజిషన్‌లో ఉన్నారు. ఆయన తొలిసారి దర్శకత్వం వహిస్తూ, ఆ సినిమా ద్వారా ప్రభుదేవా కొడుకును ఇంట్రడ్యూస్ చేయడం అనేది టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది.

కొరియోగ్రాఫర్లు దర్శకులుగా మారి మంచి విజయాలు సాధించిన చరిత్ర టాలీవుడ్‌లో ఉంది. ప్రభుదేవా స్వయంగా దర్శకుడిగా బ్లాక్‌బస్టర్స్ అందుకున్నాడు. లారెన్స్ మాస్టర్ కూడా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు. అంతేకాదు... ప్రభుదేవాను సైతం లారెన్స్ డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ కూడా అదే బాటలో పయనిస్తూ ఈ భారీ ప్రాజెక్ట్‌ను చేపట్టాడు. ఈ సినిమా కథ మ్యూజిక్, డాన్స్ నేపథ్యంతో ఉంటుందట. ప్రభుదేవా తనయుడి డాన్స్ టాలెంట్‌కు ఇది సరైన వేదిక కానుందని అభిమానులు నమ్ముతున్నారు. ఈ సినిమా మే నెలలో సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం కాస్తంత ఓపిక పట్టాల్సిందే!

Read Also: వైరముత్తుకు.. జ్ఞానపీఠ్ రద్దు చేయండి! లైంగిక వేధింపుల నిందితుడికి.. ప్రతిష్ఠాత్మక పురస్కారమా

Read Also: ఐపీయల్‌లో ఎ. ఆర్. రహమాన్ లైవ్ పెర్ఫామెన్స్

Updated Date - Mar 16 , 2026 | 09:09 PM