వైరముత్తుకు.. జ్ఞానపీఠ్ రద్దు చేయండి! లైంగిక వేధింపుల నిందితుడికి.. ప్రతిష్ఠాత్మక పురస్కారమా

ABN , Publish Date - Mar 16 , 2026 | 06:02 PM

తమిళ రచయిత వైరముత్తుకు సాహిత్య రంగంలోని ప్రతిష్టాత్మక పురస్కార మైన జ్ఞానపీఠ్ అవార్డు ప్రకటించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

Vairamuthu

తమిళ రచయిత వైరముత్తు (Vairamuthu)కు సాహిత్య రంగంలోని ప్రతిష్టాత్మక పురస్కార మైన జ్ఞానపీఠ్ అవార్డు (Jnanpith Award) ప్రకటించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రకటనను వెంటనే రద్దు చేయాలని మహిళా సంఘాల ప్రతినిధులు, స్త్రీవాద రచయితలు డిమాండ్ చేశారు.

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఈ అవార్డుకు ఎంపిక చేయడం హేయమని భూమిక ఉమెన్స్ కలెక్టివ్ నిర్వాహకురాలు కొండవీటి సత్యవతి, స్త్రీవాద ఉద్యమకారిణి తేజస్వి మాడభూషి సామాజికవేత్త అచ్యుత సునీత తదితరులు ఆదివారం ఒక ప్రకట నలో పేర్కొన్నారు.

వైరముత్తు వల్ల హింసకు గురయ్యామని బాధితు రాళ్లు న్యాయపోరాటం సాగిస్తుంటే, నిందితుడికి ఇలాంటి గౌర వాలు ప్రకటించడమేంటని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కాగా కొందరు సామాజిక కార్యకర్తలు వైరముత్తుకు అవార్డును నిరసిస్తూ ఆన్లైన్ ద్వారా సంతకాలు సేకరిస్తున్నారు. అందుకు తెలుగునాట కొందరు రచయితలు, కవులు మద్దతుగా నిలుస్తున్నారు.

మ‌రోవైపు చాలా కాలంగా వైర‌ముత్తుపై సామాజిక మాధ్య‌మాల ద్వారా పొరాటం చేస్తున్న‌ ప్రముఖ గాయ‌ని చిన్మ‌యి సైతం మ‌రోసారి ఈ వ్య‌వ‌హారంలో త‌న వాయిస్ వినిపిస్తున్నారు. లైంగిక అరోప‌ణ‌లు ఉన్న వ్య‌క్తిని ఎలా చేర‌దీస్తున్నారంటూ వైర‌ముత్తుకు అభినంద‌న‌లు తెలిపిన‌, తెలుపుతున్న సినీ సెల‌బ్రెటీలు క‌మ‌ల్ హ‌స‌న్, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ వంటి ప్ర‌ముఖుల‌ను బాహంట‌గానే ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ పోస్టులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Updated Date - Mar 16 , 2026 | 06:25 PM