రావణాసురుడిగా ప్రభాస్.. ఎలా చెప్పార్రా
ABN, Publish Date - Nov 07 , 2026 | 08:08 PM
సాధారణంగా ఇండస్ట్రీలో ప్రతి సినిమాకి మొదట ఛాయిస్ వేరే స్టార్స్ అయ్యి ఉంటారు. కానీ, ఆ సినిమా ఎవరి చేతికి వెళ్తుంది అనేది మొదటే రాసి ఉంటుంది. ఇలా స్టార్ హీరోస్ ఎన్నో మంచి ప్రాజెక్ట్స్ ని మిస్ చేసుకున్నారు.
సాధారణంగా ఇండస్ట్రీలో ప్రతి సినిమాకి మొదట ఛాయిస్ వేరే స్టార్స్ అయ్యి ఉంటారు. కానీ, ఆ సినిమా ఎవరి చేతికి వెళ్తుంది అనేది మొదటే రాసి ఉంటుంది. ఇలా స్టార్ హీరోస్ ఎన్నో మంచి ప్రాజెక్ట్స్ ని మిస్ చేసుకున్నారు. కొందరు కథ నచ్చక నో చెప్తే.. ఇంకొందరు డేట్స్ ఖాళీ లేక నో చెప్తారు. మరికొందరు ఆ పాత్ర తనకు సూట్ కాదని చెప్పేస్తారు. తాజాగా అలాంటి ఒక గోల్డెన్ ఛాన్స్ ని రిజెక్ట్ చేశాడట పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మక దృశ్యకావ్యం రామాయణ(Ramyana) చిత్రం బాక్సాఫీస్ వద్ద తొలిరోజే రూ.155 కోట్ల గ్రాస్ సాధించి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న విషయం తెల్సిందే, రాముడిగా రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రంలో లంకాధిపతి రావణాసురుడి పాత్రలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ (Yash) నభూతో నభవిష్యతి అనేలా జీవించాడు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో అదేమిటంటే.. ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న ఈ రావణాసురుడి పాత్రను మొదట దర్శకుడు నితీశ్ తివారీ యష్ కంటే ముందే రెబల్ స్టార్ ప్రభాస్ కు ఆఫర్ చేశారట. ఆయన కటౌట్, స్క్రీన్ ప్రెజెన్స్ లంకేశ్వరుడి రాయల్ అండ్ అగ్రెస్సివ్ లుక్‌కి పర్ఫెక్ట్గా సరిపోతాయని భావించారని, అయితే అప్పటికే ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంలో రాముడి పాత్రలో నటించి ఉండటం, అలాగే వరుస భారీ ప్రాజెక్టులతో డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఈ గోల్డెన్ ఛాన్స్‌ను ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రభాస్ వద్దనుకున్న ఈ రావణాసురుడి పాత్ర ఆ తర్వాత కేజీఎఫ్ ఫేమ్ రాకింగ్ స్టార్ యష్ చెంతకు చేరిందట. ఈ పాత్రలోని తీవ్రతను, నెగెటివ్ షేడ్స్‌ను సవాలుగా తీసుకున్న యష్.. తన సీరియస్ లుక్, గంభీరమైన వాయిస్ డబ్బింగ్‌తో స్క్రీన్‌పై రావణాసురుడిగా విస్ఫోటనం సృష్టించాడు. థియేటర్లలో యష్ ఎంట్రీ, ఆయన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు, క్రిటిక్స్ నుంచి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ఒక్క పాత్రతో యష్ తన మాస్ ఇమేజ్ను పూర్తి స్థాయిలో మార్చేసి, వర్సటైల్ నటుడిగా సరికొత్త రికార్డులను తిరగరాశారు. ఒకవేళ ప్రభాస్ ఈ పాత్రను అంగీకరించి ఉంటే ఆయన కెరీర్లోనూ ఇది మరొక ఐకానిక్ విలనిక్ రోల్‌గా నిలిచిపోయేదని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం అసలు ఆ పాత్రను ప్రభాస్ కి ఎలా చెప్పార్రా అని మండిపడుతున్నారు. ఇంకొంతమంది ప్రభాస్ చేసి ఉంటే ట్రోలింగ్ గా మారేది అని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా, ప్రభాస్ మిస్ చేసుకున్న ఈ అవకాశం యష్ కేరీర్‌కే అతిపెద్ద మైలురాయిగా మారడం విశేషం.