Eid 2027: సల్మాన్ ఖాన్ తో ప్రభాస్ ఢీ!
ABN, Publish Date - Sep 23 , 2026 | 03:56 PM
ప్రభాస్ 'ఫౌజీ' మార్చి మొదటి వారంలో విడుదల కాబోతోందని ఇండస్ట్రీ వర్గాల టాక్. అదే జరిగితే... ఈద్ కానుకగా రాబోతున్న సల్మాన్ ఖాన్ 'మాన్ స్టర్' మూవీతో 'ఫౌజీ' పోటీ పడాల్సి ఉంటుంది.
ఈ యేడాది డిసెంబర్ 3న విడుదల కావాల్సిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) 'ఫౌజీ' (Fauzi) మూవీని వాయిదా వేస్తున్నామని నిర్మాతల్లో ఒకరైన యలమంచిలి రవిశంకర్ స్పష్టం చేయడంతో ఇప్పుడు ఆ సినిమా విడుదల తేదీ మీద ఆసక్తికరమైన చర్చ ఫిల్మ్ సర్కిల్స్ లో సాగుతోంది. ముందు అనుకున్నట్టు ఈ సినిమా డిసెంబర్ 3న విడుదలైతే, ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న 'స్పిరిట్' (Spirit) మూవీ మార్చి 5న విడుదలయ్యేది. కానీ ఇప్పుడు 'ఫౌజీ' ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ స్పాట్‌లోకి వెళుతుందని అంటున్నారు. అంటే... మార్చి 5న 'ఫౌజీ' రాబోతోందన్న మాట.
ఇదిలా ఉంటే... టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamsi Paidipalli) ఇప్పుడు తెలుగు కాకుండా ఇతర భాషా చిత్రాలపై దృష్టి పెట్టాడు. అందులో భాగంగా మూడేళ్ల క్రితం విజయ్ (Vijay) హీరోగా తమిళంలో 'వారిసు' (Varisu) సినిమాను రూపొందించాడు. తెలుగులో 'వారసుడు' పేరుతో డబ్ అయిన ఈ సినిమా గౌరవ ప్రదమైన విజయాన్ని అందుకుంది. దాన్ని నిర్మించిన దిల్ రాజు (Dil Raju) తోనే ఇప్పుడు వంశీ పైడిపల్లి హిందీలో సల్మాన్ ఖాన్ (Salmankhan) హీరోగా 'మాన్‌స్టర్' మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను 2027 ఈద్ కానుకగా విడుదల చేయబోతున్నారు. అంటే మార్చి ఫస్ట్ వీక్ లో ఈ సినిమా విడుదల అవుతుందన్న మాట. ఆ రకంగా చూస్తే... వచ్చే మార్చి మొదటి వారంలో ప్రభాస్ 'ఫౌజీ', సల్మాన్ 'మాన్ స్టర్' ఒకదానితో ఒకటి పోటీ పడే ఛాన్స్ ఉంది.
ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. వంశీ పైడిపల్లి తొలి చిత్రం 'మున్నా'లో హీరో ప్రభాసే. దానిని నిర్మించింది కూడా దిల్ రాజే! అప్పట్లో ఆ సినిమా పరాజయం పాలైంది. దాంతో మళ్ళీ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రభాస్ నటించడానికి సాహసించలేదు. ఇప్పుడు దిల్ రాజు - వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రాబోతున్న హిందీ సినిమా 'మాన్ స్టర్' ప్రభాస్ 'ఫౌజీ'కి చెక్ పెట్టబోతోంది. ఎప్పుడైతే 'ఫౌజీ' మార్చి 5కి వెళ్ళిపోయిందో... ఇప్పుడు 'స్పిరిట్' విడుదల ఎప్పుడనే ప్రశ్న మొదలైంది. ఆ సినిమా అక్టోబర్ లో విడుదలయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ యేడాది సోలో మూవీ 'ది రాజా సాబ్' తో తృప్తిపడిన ప్రభాస్ వచ్చే సంవత్సరం మాత్రం 'ఫౌజీ', 'స్పిరిట్' చిత్రాలతో డబుల్ థమాకా ఇస్తాడని అభిమానులు భావిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో!
ఇది కూడా చదవండి:
రూ.100 కోట్ల క్లబ్‌లో ‘మండాడి’
టాలీవుడ్‌లో కొత్త పవర్‌ఫుల్ కాంబో? ‘ఓజీ’ డైరెక్టర్‌తో.. రామ్ చరణ్ సినిమా?
Chiranjeevi: నన్నెవరూ అడగరు.. కానీ నేనే క్రమశిక్షణ తప్పితే ఎలా?