టూర్‌కు రెడీ అవుతోన్న ప్రభాస్.. వచ్చాక ఇక ర్యాంపే!
ABN, Publish Date - Jul 11 , 2026 | 01:17 PM
ప్రస్తుతం ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ బిజీయెస్ట్ స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా ప్రభాస్ మాత్రమే. ఆయన లైనప్ చూస్తే ట్రేడ్ వర్గాలకు కూడా మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.
రెబల్‌స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) బాక్సాఫీస్ స్టామినా ఎలాంటిదో ఇట్టే అర్థమవుతుంది. ప్లాప్ టాక్‌తో కూడా వందల కోట్లు రాబట్టగల సత్తా ఆయన సొంతం. ప్రస్తుతం ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ బిజీయెస్ట్ స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా ప్రభాస్ మాత్రమే. ఆయన లైనప్ చూస్తే ట్రేడ్ వర్గాలకు కూడా మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. హను రాఘవపూడి ‘ఫౌజీ’ (Fauzi), సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ (Spirit), నాగ్ అశ్విన్ ‘కల్కి-2’ (Kalki 2).. ఇలా వరుస క్రేజీ ప్రాజెక్టులను ప్యారలల్‌గా సెట్స్ మీద ఉంచుతూ ఏమాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా గడుపుతున్నారు ప్రభాస్.
ప్రస్తుతం ప్రభాస్ ఫోకస్ అంతా ‘ఫౌజీ, స్పిరిట్’ మూవీల పైనే ఉంది. ఈ రెండు సినిమాల షూటింగ్స్‌ను ప్యారలల్‌గా చేసుకుంటూ బిజీ షెడ్యూల్‌తో ఉన్నారు. తాజాగా ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించిన ఒక భారీ యాక్షన్ షెడ్యూల్‌లో ఆయన రేయింబవళ్లు కష్టపడుతున్నారు. సందీప్ రెడ్డి వంగా మార్క్ వైలెంట్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను కంప్లీట్ చేస్తున్నారు. అయితే, ఈ హెవీ షెడ్యూల్ పూర్తయ్యాక ప్రభాస్ ఒక చిన్న బ్రేక్ తీసుకోబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ బ్రేక్ కోసం ఆయన యూరప్ (Prabhas Europe Trip) వెళ్తున్నారట. అక్కడ దాదాపు పది రోజుల పాటు రిలాక్స్ అయ్యి, ఫుల్ ఎనర్జీతో తిరిగి రానున్నారు. యూరప్ ట్రిప్ ముగించుకుని తిరిగి రాగానే, ప్రభాస్ నేరుగా ‘ఫౌజీ’ సెట్స్‌లో అడుగుపెడతారు. ‘సీతా రామం’ వంటి సెన్సిబుల్ హిట్ ఇచ్చిన హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ఈసారి ఏమాత్రం ఆలస్యం చేయకుండా, వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని ప్రభాస్ గట్టిగా డిసైడ్ అయ్యారట. డిసెంబర్ నాటికి ‘ఫౌజీ’ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలనేది మేకర్స్ పక్కా డెడ్‌లైన్. ఈ సంవత్సరం ‘రాజా సాబ్’తో ప్రేక్షకులను అలరించలేకపోయినా.. ఆ లోటును ‘ఫౌజీ’తో వడ్డీతో సహా తీర్చేయాలని టీమ్ భావిస్తోంది. స్వాతంత్య్రానికి పూర్వం సాగే ఈ కథలో ప్రభాస్ బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ సోల్జర్‌గా కనిపిస్తుండటం అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేస్తోంది.
ఇక ఈ సినిమా బిజినెస్ విషయానికొస్తే.. క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తోంది. షూటింగ్ దశలో ఉండగానే వందల కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్ రైట్స్‌ను ప్రతిష్టాత్మక హోంబలే ఫిల్మ్స్ సంస్థ, ప్రత్యంగిర సినిమాస్‌తో కలిపి దక్కించుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాకుండా, ఈ సినిమా డిజిటల్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కళ్లు చెదిరే ధరకు సొంతం చేసుకుంది. దీన్ని బట్టి మేకర్స్ కంటెంట్ మీద ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో స్పష్టమవుతోంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఎవరినీ డిజప్పాయింట్ చేయదనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ‘ఫౌజీ’ లైనప్ పక్కాగా ఉంటే, మరో వైపు ‘స్పిరిట్’ మూవీని కూడా సందీప్ రెడ్డి వంగా శరవేగంగా పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి 60 నుంచి 70 శాతం వరకు షూటింగ్ పూర్తయిందని ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్‌ను మునుపెన్నడూ చూడని రగ్గడ్ యాంగిల్‌లో చూపించబోతున్నారు. ఒకవేళ అంతా అనుకున్నట్లు జరిగితే, ఈ ఏడాది డిసెంబర్‌లో ‘ఫౌజీ’తో ప్రేక్షకులను పలకరించి, ఆ వెంటనే వచ్చే ఏడాది మార్చి 5న ‘స్పిరిట్’ మూవీతో బిగ్గెస్ట్ బ్లాస్ట్ ఇవ్వడానికి ప్రభాస్ రెడీ అవుతున్నారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఇలాంటి రెండు బ్రహ్మాండమైన పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కావడం అభిమానులకు పండగే. ఈ రెండు ప్రాజెక్టులు ప్రభాస్ కెరీర్‌కు మరింత బూస్టప్‌ను ఇవ్వడం ఖాయం. యూరప్ ట్రిప్ నుంచి వచ్చాక మొదలుపెట్టే అసలైన ర్యాంపేజ్ ఎలా ఉంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు నేను.. అదృష్టంగా భావిస్తున్నా: జయప్రద
Sunday Tv Movies: జూలై 12, ఆదివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
పవన్ కళ్యాణ్ రెండు భుజాలకీ రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్.. శస్త్ర చికిత్స!