సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Prabhas: ‘డార్లింగ్’ ప్రభాస్ ఫ్యాన్స్‌కు సమ్మర్ ట్రీట్ రెడీ..

ABN, Publish Date - Apr 11 , 2026 | 10:28 PM

సంక్రాంతికి వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ చిత్రం ప్రేక్షకులనే కాకుండా, అభిమానులను సైతం నిరాశ పరిచింది. ప్రభాస్ వంటి కటౌట్‌ని ఎలా వాడుకోవాలో, ప్రభాస్‌తో ఎలాంటి సినిమా తీయాలనే విషయంలో డైరెక్టర్ మారుతి తడబడ్డాడనేలా, అంతా కామెంట్స్ చేశారు.

Prabhas in Darling Movie

సంక్రాంతికి వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) నటించిన ‘ది రాజా సాబ్’ (The Raja Saab) చిత్రం ప్రేక్షకులనే కాకుండా, అభిమానులను సైతం నిరాశ పరిచింది. ప్రభాస్ వంటి కటౌట్‌ని ఎలా వాడుకోవాలో, ప్రభాస్‌తో ఎలాంటి సినిమా తీయాలనే విషయంలో డైరెక్టర్ మారుతి తడబడ్డాడనేలా, అంతా కామెంట్స్ చేశారు. ఇంకా చెప్పాలంటే, ‘ది రాజా సాబ్’ కంటెంట్‌కు జనాలు కనెక్ట్ కాలేకపోయారు. ప్రభాస్ ఏరికోరి అలాంటి సబ్జెక్టే కావాలంటే మారుతి మాత్రం ఏం చేస్తాడులే కానీ, సంక్రాంతికి డిజప్పాయింట్ అయిన ఫ్యాన్స్‌కు, ఈ వేసవికి ట్రీట్ ఇచ్చేందుకు రెబల్ స్టార్ సిద్ధమయ్యారు. అదేంటి? ప్రభాస్ చేస్తున్న సినిమాలేవీ ఇప్పుడు విడుదలకు లేవు కదా? మరి సమ్మర్ ట్రీట్ ఏంటి? అని ఆశ్చర్యపోవద్దు. అసలు విషయం ఏమిటంటే..


ప్రస్తుతం అన్ని సినిమా ఇండస్ట్రీలలో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలియంది కాదు. ఒకప్పటి కల్ట్ క్లాసిక్ చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ, మరోసారి పాత జ్ఞాపకాలను బయటకు తీస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్దకు ఒకప్పటి స్టార్ హీరోల చిత్రాలు చాలానే రీ రిలీజ్ అయ్యాయి. హీరోల పుట్టినరోజులను పురస్కరించుకుని, లేదంటే ఏదో ఒక అకేషన్‌కు ఆయా హీరోల ఓల్డ్ మూవీస్‌ని 4కె వెర్షన్‌లోకి మార్చి రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ బాగా వర్కవుటైంది. కలెక్షన్స్ కూడా బాగా వస్తుండటంతో, ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతూనే ఉంది. అలా ఇప్పుడు ప్రభాస్ నటించిన కల్ట్ క్లాసిక్ చిత్రం ‘డార్లింగ్’ (Darling Re Release)ను ఏప్రిల్ 23న 4కె వెర్షన్‌లో రీ రిలీజ్ చేయబోతున్నారు.


అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు, రీ రిలీజ్‌ ట్రైలర్‌ను కూడా వదిలారు. ఇప్పుడీ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంక్రాంతికి ఇవ్వాల్సిన ట్రీట్‌ని ఇలా ప్లాన్ చేశావా సామి? అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ట్రైలర్‌కు కామెంట్స్ చేస్తుండటం విశేషం. ‘డార్లింగ్’ విషయానికి వస్తే.. ప్రభాస్ సరసన కాజల్ అగర్వాల్ నటించిన ఈ చిత్రాన్ని ‘తొలిప్రేమ’ దర్శకుడు కరుణాకరణ్ తెరకెక్కించారు. ఎస్వీసీసీ బ్యానర్‌ నిర్మించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమా కేవలం అభిమానులకే కాదు, ప్రేక్షకులెందరికో ఫేవరేట్ మూవీ అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇందులో ప్రభాస్ పాత్ర.. పక్కింటి కుర్రాడి తరహాలోనే ఉంటుంది. అలాగే, వైవిధ్యభరితమైన లవ్ స్టోరీతో పాటు, మంచి సెంటిమెంట్ కలయికతో ఈ మూవీని కరుణాకరణ్ రూపొందించారు. కచ్చితంగా ఈ మూవీ రీ రిలీజ్‌లో కూడా మంచి ఆదరణను పొందుతుందని ఫ్యాన్స్ అంతా భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Chiranjeevi: చిరంజీవికి తప్పని వెయిటింగ్.. ఈ అడ్డంకులేంటి?

Venu Udugula: మంగ్లీ ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు

UBS OTT: ఉస్తాద్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ వివరాలివే!

Jailer 2: షారుఖ్ ప్లేస్‌లో పవన్ కళ్యాణ్.. బాబోయ్, ఈ వార్త నిజమైతేనా?

దయచేసి రూ.16 కోట్లు సాయం చేయండి: నందమూరి బాలకృష్ణ

Updated Date - Apr 11 , 2026 | 10:33 PM