నర్తకిగా పూజిత పొన్నాడ.. ఫస్ట్ లుక్ అదిరింది
ABN, Publish Date - Oct 05 , 2026 | 02:43 PM
కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించి దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న డైరెక్టర్ శ్రీధర్ గాదె మరో కొత్త చిత్రంతో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ (SR Kalyanamandapam) చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించి దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న డైరెక్టర్ శ్రీధర్ గాదె మరో కొత్త చిత్రంతో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై ఆది సాయి కుమార్‌తో ‘చుట్టాలబ్బాయ్’ వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను, ఆనంద్ దేవరకొండతో ‘హైవే’ వంటి యూనిక్ థ్రిల్లర్ మూవీని నిర్మించిన ప్రొడ్యూసర్ వెంకట్ తలారి.. తమ ప్రొడక్షన్ నెం.3గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ ఫేమ్ ఈశ్వర్ రాచిరాజు హీరోగా నటిస్తుండగా.. నందు, లిఖిత హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూజిత పొన్నాడ, సింధు కాసారం ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్‌ని మేకర్స్ వదిలారు.
ఈ చిత్రంలో ‘నర్తకి’ (Narthaki) పాత్రలో టాలెంటెడ్ యాక్ట్రెస్ పూజిత పొన్నాడ (Poojitha Ponnada) నటిస్తున్నట్లుగా తెలుపుతూ.. ఆమె బర్త్‌డే (Happy Birthday Poojitha Ponnada)ను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రాజభవనంలో నర్తకిమణిగా ముస్తాబైన పూజిత పొన్నాడ లుక్ ఆకట్టుకుంటోంది. నటిగా ఆమెకు ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకొస్తుందనే అంచనాలను పెంచేలా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నర్తకి పాత్రకు పర్ఫెక్ట్ అన్నట్లుగా పూజిత ఇందులో కనిపిస్తూ.. ఆశ్చర్యపరుస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోందని ఈ సందర్భంగా మేకర్స్ తెలియజేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే హారర్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. ఈ సినిమాను సరికొత్త కథా కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు శ్రీధర్ గాదె తెరకెక్కిస్తున్నారని, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఇతర వివరాలను తెలియజేస్తామని నిర్మాత వెంకట్ తలారి తెలిపారు. ఈ సినిమా తమ ప్రొడక్షన్‌కు భారీ హిట్‌ని ఇస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
నాపై ఐటీ దాడులా.. అసలు నిజాలు తెలుసుకోరా?: రకుల్ ప్రీత్ సింగ్
‘చుట్టమల్లే’ మార్ఫింగ్ వీడియోపై జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
పాత్రకు జీవం పోసేందుకు.. నటీనటుల్లో తరగని నటనాభిలాష!