నందమూరి ఫ్యాన్స్‌కు ‘పెద్ది’ ట్రీట్.. థియేటర్లకు క్యూ కట్టాల్సిందే!
ABN, Publish Date - May 08 , 2026 | 08:30 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘పెద్ది’ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. ఇప్పుడీ సినిమా నందమూరి అభిమానులకు కూడా ట్రీట్ ఇవ్వబోతోన్నట్లుగా తెలుస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘పెద్ది’ (Peddi Movie) సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో చరణ్ మేకోవర్ చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తుండగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అప్పుడే సెన్సేషన్ మొదలుపెట్టింది. 2026 జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం కోసం నార్త్ అమెరికాలో బుకింగ్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. చరణ్ క్రేజ్‌కు తోడు బుచ్చిబాబు మార్క్ ఎమోషన్స్ తోడవ్వడంతో ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు నందమూరి అభిమానులకు కూడా ‘పెద్ది’ కిక్కు ఇవ్వబోతున్నారు. ఆ కిక్కు కోసం ‘పెద్ది’ టికెట్స్ తెంచాల్సిన అవసరాన్ని అభిమానులకు తారక్ కల్పించబోతున్నారు. అసలు విషయం ఏమిటంటే..
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) - ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో రాబోతున్న ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) టీజర్ లేదా గ్లింప్స్, ‘పెద్ది’ సినిమా ప్రింట్స్‌కు అటాచ్ చేయబోతున్నట్లుగా తాజాగా ఇండస్ట్రీ వర్గాలలో టాక్ మొదలైంది. ఈ రెండు భారీ ప్రాజెక్టులను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. తారక్ పుట్టినరోజు సందర్భంగా మే 20, 2026న డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో రానున్న ఈ టీజర్, ఆ తర్వాత వెండితెరపై ‘పెద్ది’ సినిమాతో కలిసి ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇవ్వనుందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమాపైనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ దృష్టి పెట్టారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ పాన్-ఇండియా మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, 2027లో జూన్ 11న సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్, తారక్ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఒకేసారి థియేటర్లలో చూడబోతుండటంతో మెగా-నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. అయితే, ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. అదీ కూడా తారక్ బర్త్‌డే రోజు వచ్చే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
జబర్దస్త్ దొరబాబు కొత్త ఇల్లు చూశారా.. కళ్ళు జిగేల్ మనాల్సిందే!
తెలుగబ్బాయినే పెళ్లి చేసుకుంటా: పాయల్
Peddi Movie: కథ విని, 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయా- ప్రొడక్షన్ డిజైనర్
Lavanya Tripathi: ఇకపై ప్రెగ్నెంట్ అని తెలిస్తే.. ఆ పని చేయను