OG2: తుపాను రావడానికి ముందు.. నిశ్శబ్దం
ABN , Publish Date - Jun 25 , 2026 | 01:31 PM
‘‘ఓజీ-2' సినిమా కోసం నేను రెడీ'' అంటున్నారు పవన్ కళ్యాణ్. దీనికి సంబందించిన వర్కింగ్ సెషన్స్ స్టార్ట్ అయ్యాయని, ఈ సినిమాలో ఓ ప్రత్యేకత ఉందని చెప్పారు.
పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘ఓజీ’ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. సుజీత్ దర్శకత్వంలో దీనికి పార్ట్ 2 కూడా ప్రకటించారు. పార్ట్ 2కి సంబంధించిన పనులు ప్రారంభమైనట్లు తెలుపుతూ మేకర్స్ స్పెషల్ వీడియో విడుదల చేశారు. 'తుపాను రావడానికి ముందు.. నిశ్శబ్దం ఉంటుంది.. ‘గంభీర కథ సిద్ధమవుతోంది ’ అని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. పవన్, సుజీత్ స్టోరీ గురించి చర్చించుకుంటున్న ఈ వీడియోలో ‘నేను రెడీ..’ అని పవన్ (Pawan Kalyan) సుజీత్ తో చెప్పడం అభిమానులను నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఐతే ‘ఓజీ2'లో పవన్ కళ్యాణ్ కు ఒక పెట్ కూడా ఉంటుందని వెల్లడించారు.
ALSO READ:
Tollywood: పర్శంటేజ్ పై ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ షరతులు!
లీగల్ వివాదంలో ప్రభాస్ ‘స్పిరిట్’.. టైటిల్ మార్చాల్సిందేనా?
పీఆర్ స్టంట్స్.. పిక్చర్స్‌కు పనికొచ్చేనా..!
‘పెద్ది’ సక్సెస్ చూసి నాకు ‘ఠాగూర్’లోని డైలాగ్ గుర్తొచ్చింది: రామ్ చరణ్
Dharman: తలైవర్ 173 టైటిల్ ఖరారు.. రఫ్పాడించేస్తోన్న ఫస్ట్ లుక్!