సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

PKCW: సినీ ఆశావహులకు పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్

ABN, Publish Date - Jul 01 , 2026 | 06:05 PM

చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాలని, తమ ప్రతిభను నిరూపించుకోవాలని తహతహలాడే ప్రతిభావంతులు ఎందరో ఉన్నారు. అలాంటి వారందరికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైన అవకాశాన్ని ప్రకటించారు.

Pawan Kalyan PKCW

చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాలని, తమ ప్రతిభను నిరూపించుకోవాలని తహతహలాడే ప్రతిభావంతులు ఎందరో ఉన్నారు. అలాంటి వారందరికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒక అద్భుతమైన అవకాశాన్ని ప్రకటించారు. ఆయన సొంత నిర్మాణ సంస్థ అయిన ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ (Pawan Kalyan Creative Works)’.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రియేటర్స్, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, సినీ అవకాశాల కోసం చూస్తున్న సినీ ఔత్సాహికులు, ప్రొఫెషనల్స్, రీసెర్చర్స్‌ను తమ గ్లోబల్ క్రియేటివ్ ఎకోసిస్టమ్‌లో భాగస్వాములు కావాల్సిందిగా అధికారికంగా ఆహ్వానాన్ని విడుదల చేసింది. సినిమా పట్ల ప్యాషన్ ఉన్నవారందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు #PKCWCommunity పేరిట ఈ బృహత్తర కార్యక్రమానికి ఈ సంస్థ శ్రీకారం చుట్టింది.


ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాలెంటెడ్ పీపుల్స్ నమ్మకంతోనే ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’కు పునాది పడింది. సినిమా రంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్‌, తదుపరి తరం క్రియేటివ్ ఇన్నోవేషన్‌కు సంబంధించిన ప్రతిభావంతులను గుర్తించి, వారికో గుర్తింపు ఇవ్వడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. సినీ పరిశ్రమలో కథకుడిగానే కాకుండా, ఫిల్మ్‌మేకర్‌గా, టెక్నీషియన్‌గా మూడు దశాబ్దాలకు పైగా ప్రయాణం చేసిన పవన్ కళ్యాణ్.. ఎంతోమంది కొత్త ప్రతిభను గుర్తించి, వారి విజయాలకు మార్గదర్శకుడిగా నిలిచారు. PKCW దృష్టిలో కథలు చెప్పడమనేది కేవలం వ్యాపార కోణం మాత్రమే కాదు.. విలువల పరిరక్షణకు, సమాజాన్ని మేల్కొల్పడానికి ఉపయోగపడే ఒక శక్తివంతమైన మాధ్యమంగా దీనిని ఆయన చూస్తున్నారు.


ఈ సందర్భంగా ఈ బ్యానర్ వ్యవస్థాపకులైన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఒక అద్భుతమైన కథకుడు ఉంటాడు. కథలు అనేవి మనల్ని అలరించాలి, ఆలోచింపజేయాలి. ఇంకా మనకు జ్ఞానాన్ని ప్రసాదించాలి. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా అలాంటి క్రియేటర్స్ అందరితో కలిసి పనిచేయడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని స్పష్టం చేశారు. అసాధారణమైన క్రియేటివిటీ కలిగి ఉండి, సరైన గుర్తింపు కోసం ఎదురుచూసే వారిని ప్రోత్సహిస్తూ.. సరికొత్త తరం ఫిల్మ్‌మేకర్లను, సినీ నిపుణులను తయారుచేస్తూ.. భారతీయ సినిమా పరిణామ క్రమంలో భాగస్వామ్యం చేయడమే ఈ కమ్యూనిటీ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మరి.. ఇంకెందుకు ఆలస్యం.. మీలోని సినీ టాలెంట్‌కు ఒక అంతర్జాతీయ గుర్తింపు దక్కాలంటే వెంటనే ఈ #PKCWCommunityలో జాయిన్ అవ్వండి!

ఇవి కూడా చదవండి:

‘అంబ’స్ రివెంజ్’.. ఈ సినిమా స్పెషల్ ఏంటో తెలుసా

‘కాగితం పడవలు’ చిత్రబృందం చేసిన పనికి చిరు ఫిదా.. ఏం చేశారంటే

Spider - Man : షాకింగ్ రెమ్యూనరేషన్... మెస్సీ నా మజాకా!?

Updated Date - Jul 01 , 2026 | 06:05 PM