'పాపం ప్రతాప్' ని ఓటీటీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారే
ABN, Publish Date - May 08 , 2026 | 04:08 PM
కొన్ని సినిమాలు థియేటర్ లో హిట్ అయినా.. ఓటీటీలో ప్లాప్ అవుతాయి. మరికొన్ని సినిమాలు థియేటర్ లో ప్లాప్ అయినా.. ఓటీటీలో మాత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని అందుకుంటాయి.
కొన్ని సినిమాలు థియేటర్ లో హిట్ అయినా.. ఓటీటీలో ప్లాప్ అవుతాయి. మరికొన్ని సినిమాలు థియేటర్ లో ప్లాప్ అయినా.. ఓటీటీలో మాత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని అందుకుంటాయి. తాజాగా పాపం ప్రతాప్ ( Papam Prathap) సినిమాస్ రెండో కేటగిరి అని చెప్పొచ్చు. తిరువీర్ (Tiruveer), పాయల్ రాధాకృష్ణ (Payal Radhakrishna) జంటగా ఎస్పీ దుర్గా నరేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పాపం ప్రతాప్. అజయ్ గోష్, రాశి కీలకపాత్రల్లో అంటించిన ఈ చిత్రం ఏప్రిల్ 17 న రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ని అందుకుంది. కామెడీ నచ్చినా కూడా స్టోరీ లైన్ పాతది అని పెదవి విరిచారు.
తాజాగా పాపం ప్రతాప్.. ఓటీటీ బాట పట్టింది. ఈ సినిమా హక్కులను ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. మే 7 నుంచి పాపం ప్రతాప్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలో వీక్షించి పాజిటివ్ రెస్పాన్స్ అందిస్తున్నారు. సినిమా బావుందని, పర్ఫెక్ట్ కామెడీ ఎంటర్ టైనర్ అని చెప్పుకొస్తున్నారు. ముఖ్యం ప్రతాప్ గా తిరువీర్ నటన చాలా బావుందని అంటున్నారు. థియేటర్ లో కంటే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసి ఉంటే పెద్ద హిట్ అయ్యేదని కొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈటీవీ విన్ లో పాపం ప్రతాప్ సినిమా ట్రెండింగ్ లో ఉంది.
ఇక పాపం ప్రతాప్ కథ విషయానికొస్తే.. ప్రతాప్ (తిరువీర్) కి చిన్నప్పటి నుంచి బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ) అంటే చాలా ఇష్టం. ఇంట్లో వాళ్ళను ఒప్పించి బుజ్జమ్మను పెళ్ళిచేసుకుంటాడు ప్రతాప్. పెళ్లి తరువాత లైఫ్ ఆనందంగా ఉంటుంది అనుకుంటే.. ప్రతాప్ తనకు వద్దు అంటూ మూడురోజుల తరువాత బుజ్జమ్మ పంచాయితీ పెడుతుంది. ప్రతాప్ కి చెప్పుకోలేని సమస్య ఉంటుందని, అది తాను బయటపెట్టలేనని, అతనంతట అతనే తెలుసుకొని, మార్చుకొని వస్తే కాపురం చేస్తానని చెప్తుంది. అసలు ప్రతాప్ కి ఉన్న సమస్య ఏంటి.. ? బుజ్జమ్మ భయానికి కారణమేంటి.. ? వీర ప్రతాప్.. పాపం ప్రతాప్ గా ఎలా మారాడు.. ? అనేది కథ. మరి థియేటర్ లో అలరించలేని పాపం ప్రతాప్.. ఓటీటీలో రికార్డులు సృష్టిస్తాడేమో చూడాలి.