పూజా కార్యక్రమాలతో ‘ఓస్కార్ మిస్సింగ్’ ప్రారంభం..

ABN , Publish Date - Oct 24 , 2026 | 01:54 PM

పసుపులేటి రాధాకృష్ణ, శివాని జంటగా  చంద్రమౌళి పి.జి. దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఓస్కార్ మిస్సింగ్’. 

పసుపులేటి రాధాకృష్ణ, శివాని జంటగా  చంద్రమౌళి పి.జి. దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఓస్కార్ మిస్సింగ్’ (Oscar Missing).  పవన్ మాత, నితిన్ మాత నిర్మాతలు. శనివారం ఈ సినిమా పూజ కార్యక్రమాలతో  మొదలైంది. శ్రీమతి మాత రాజేశ్వరి సమర్పణలో భూమాత ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రం ఆద్యంతం హాస్యభరితంగా  ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఈ చిత్రం తెరకెక్కనుందని  చెబుతున్నారు.

పూజ కార్యక్రమాల అనంతరం దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘ఓస్కార్ మిస్సింగ్’ మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాం. ఇందులో కొన్ని నిజ జీవిత పాత్రలను కూడా ప్రతిబింబించేలా కథను రూపొందించాం. సినిమా ఆద్యంతం హాస్యభరితంగా సాగుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే మా ప్రధాన లక్ష్యం. ఈ సినిమాను రెండు షెడ్యూళ్లలో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాం. డిసెంబర్ చివరి నాటికి షూటింగ్‌ను ముగించి, వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం'  అని తెలిపారు. ఈ చిత్రంలో అలీతో పాటు చిత్రం శ్రీను, బిత్తిరి సత్తి, జబర్దస్త్ ఫణి, రాము, దుర్గారావు, శోభ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  

ఇవి కూడా చదవండి:

ప్రభాస్ ‘ఫౌజీ’లో నేతాజీగా చేసింది ఎవరో తెలుసా?

ఈసారి ఊహించినట్లుగా ఉండదు.. వేరే కోణంలో ఉంటుంది.. ఏం చేశావ్ గురూజీ?

Sunday TV Movies: అక్టోబ‌ర్ 25, ఆదివారం.. స్మాల్ స్క్రీన్‌పై వచ్చే సినిమాలు

Updated Date - Oct 24 , 2026 | 03:13 PM