రాధికా ఆప్టే బోల్డ్ కామెంట్స్.. ఆలియా, దీపికా సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు!
ABN , Publish Date - Oct 24 , 2026 | 12:56 PM
‘అక్క’ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో రాధికా ఆప్టే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా థియేటర్లలో విడుదలవుతుందా, ఓటీటీలోనా అనేది కాకుండా పాత్ర నచ్చితేనే ప్రాజెక్ట్ అంగీకరిస్తానన్నారు. ఆలియా భట్, దీపికా పదుకొణే వంటి స్టార్ హీరోయిన్ల సినిమాలకు ఓపెనింగ్స్ వస్తాయని, బాక్సాఫీస్ విజయాన్ని అంచనా వేయడం కష్టమని వ్యాఖ్యానించారు.
వివిధ భారతీయ భాషల్లో పలు చిత్రాలలో నటించిన రాధికా ఆప్టే ఏదో కారణంగా నిత్యం వార్తలలో ఉంటూనే ఉంటారు. తాజాగా ఆమె నటించిన 'అక్క' వెబ్ సీరిస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. దీని ప్రచారంలో భాగంగా రాధికా ఆప్టే ఎప్పటిలానే బోల్డ్ స్టేట్ మెంట్స్ ఇచ్చి... మీడియాలో సందడి చేస్తున్నారు. తాను కొత్త ప్రాజెక్ట్ ను అంగీకరించేప్పుడు అది థియేటర్లలో విడుదల అవుతుందా? ఓటీటీలోనా? అనేది పట్టించుకోనని రాధికా ఆప్టే తెలిపింది. తనకు పాత్ర నచ్చితే ఏ మీడియం అనేది చూడకుండానే గ్రీన్ సిగ్నల్ ఇస్తానని చెప్పింది. రాధికా ఆప్టే సినిమాలు గత కొంతకాలంగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆమె యాక్ట్ చేసిన 'లస్ట్ స్టోరీస్ 3, సాలీ ముహాబ్బత్, మిసెస్ అండర్ కవర్, మోనిక ఓ మై డార్లింగ్' ఇవన్నీ డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాయి. బహుశా అందుకే కావచ్చు థియేట్రికల్ రిలీజ్ మూవీస్ మీద ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసింది. చాలామంది ఫిమేల్ యాక్టర్స్ బాక్సాఫీస్ ను దృష్టిలో పెట్టుకుని హీరో ఓరియంటెడ్ మూవీస్ చేస్తుంటారని రాధికా ఆప్టే తెలిపింది. అయితే ఏ సినిమా థియేటర్లలో ఆడుతుంది, ఏది ఆడదు అనేది గెస్ చేయడం కష్టమని చెప్పింది. తాను నటించిన చాలా మంచి సినిమాలు కూడా థియేటర్లలో ఆడలేదని అంటూ, 'థియేటర్లలో సినిమా ఆడాలంటే చాలా కాలిక్యులేషన్స్ ఉంటాయి. నేనేమీ ఆలియా భట్ నో, దీపికా పదుకొణేనో కాదు. వాళ్ళ సినిమాలకు కనీసం ఓపెనింగ్స్ వస్తాయి. హీరోలు నటించే సినిమాలలో నటిస్తే ఇలాంటివి సాధ్యం. నేను అలాంటి సినిమాలు చేస్తే బహుశా అవీ ఆడొచ్చు' అని రాధికా ఆప్టే తెలిపింది.
రాధికా ఆప్టే చెప్పినట్టుగా అగ్ర కథానాయకులతో ఆలియా, దీపికా నటించిన సినిమాలే బాక్సాఫీస్ బరిలో సందడి చేశాయి. ఆలియా నటించిన 'బ్రహ్మస్త్ర, ఆర్.ఆర్.ఆర్. రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' సినిమాలు ఆడాయి. కానీ ఆమె సోలో హీరోయిన్ గా నటించిన 'గంగూభాయ్ కతియావాడి' తర్వాత వచ్చిన 'జిగ్రా', తాజా చిత్రం 'ఆల్ఫా' బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ఇక దీపికా పదుకొణే విషయానికి వస్తే... ఆమె షారుఖ్ ఖాన్ తో నటించిన 'పఠాన్, జవాన్' సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసుకున్నాయి. అలానే ప్రభాస్ తో కలిసి నటించిన 'కల్కి 2898 ఎ.డి.' సైతం గ్రాండ్ విక్టరీని అందుకుంది. దీపికా పదుకొణే నటించిన చివరి లేడీ ఓరియంటెడ్ మూవీ 'ఛపాక్' 2018లో విడుదలైంది. ఆ తర్వాత ఆమె అలాంటి సినిమాలేవీ చేయలేదు.
ఇవి కూడా చదవండి:
ప్రభాస్ ‘ఫౌజీ’లో నేతాజీగా చేసింది ఎవరో తెలుసా?
ఈసారి ఊహించినట్లుగా ఉండదు.. వేరే కోణంలో ఉంటుంది.. ఏం చేశావ్ గురూజీ?
Sunday TV Movies: అక్టోబర్ 25, ఆదివారం.. స్మాల్ స్క్రీన్‌పై వచ్చే సినిమాలు