సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Khadgam Re Release: ఖ‌డ్గం.. మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది

ABN, Publish Date - Jul 19 , 2026 | 07:29 PM

కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్,రవితేజ, ప్రకాశ్ రాజ్, శివాజీ రాజా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఖడ్గం’ మ‌రోమారు రీ రిలీజ్‌కు సిద్ధ‌మైంది.

Khadgam

కృష్ణవంశీ దర్శకత్వంలో రవితేజ (Ravi Teja), శ్రీకాంత్ (Srikanth), ప్రకాశ్ రాజ్, శివాజీ రాజా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఖడ్గం’ (Khadgam). 2002లో థియేట‌ర్ల‌కు వ‌చ్చిన ఈ సినిమా అప్పట్లో ఎటువంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. లవ్, కామెడీ, దేశం ఎమోషన్, సినిమా ఎమోషన్.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్ కలిపి మల్టీ జానర్‌లో ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi). దేవి శ్రీ ప్రసాద్ సంగీతం మ‌రో హైలెట్‌. ఇప్పటికీ ప్ర‌తి ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే సమయాల్లో ఈ సినిమాను ఖచ్చితంగా టెలివిజన్‌లో టెలికాస్ట్ చేస్తూ ఉంటారు.

అయితే ఇప్పుడు అల‌నాటి స‌క్సెస్‌, క్రేజ్ ఉన్న సినిమాల‌ రీ రిలీజ్‌ల స‌ర్వం న‌డుస్తుండ‌డంతో ప్రస్తుతం ఈ చిత్రం కూడా తిరిగి మ‌రోమారు రీ రిలీజ్‌కి ముస్తాబవుతోంది. (Khadgam Ready to Re Release). స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్బంగా ఆగష్టు 15న ఖడ్గం మరోసారి థియేటర్స్‌లో విడుదల చేయ‌నున్నారు, పాప్ కార్న్ ప్రొడక్షన్స్ లో దేవరపల్లి రేవంత్ సమర్పణలో విష్ణుమొలకల నక్షత్ర నిర్మాతగా కృష్ణ వడిగేపల్లి, కాకర్లమూడి రామకృష్ణ సహా నిర్మాతగా ఖడ్గం చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Updated Date - Jul 19 , 2026 | 07:45 PM