సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Om Shanti Shanti Shantihi Trailer: హీరోకి తక్కువ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ

ABN, Publish Date - Jan 23 , 2026 | 07:07 PM

డైరెక్టర్ కమ్ నటుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker), ఈషా రెబ్బ (Eesha Rebba) జంటగా ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓం శాంతి శాంతి శాంతిః (Om Shanti Shanti Shantihi).

Om Shanti Shanti Shantihi

Om Shanti Shanti Shantihi Trailer: డైరెక్టర్ కమ్ నటుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker), ఈషా రెబ్బ (Eesha Rebba) జంటగా ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓం శాంతి శాంతి శాంతిః (Om Shanti Shanti Shantihi). మలయాళంలో సూపర్ హిట్ అయిన జయ జయ జయ జయహే సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. బ్రహ్మాజీ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా జనవరి 30 న రిలీజ్ కు సిద్దమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

అంబటి ఓంకార్ నాయుడు చేపల వ్యాపారం చేస్తూ ఇంటిని నడిపిస్తూ ఉంటాడు. అతనికి శాంతితో వివాహం జరుగుతుంది. ఆడపిల్ల కంటే మగపిల్లాడిని ఎక్కువగా చూసే కుటుంబం నుంచి వచ్చిన శాంతి.. పెళ్లి తరువాత తన జీవితం మారుతుంది అనుకుంటుంది. మరి శాంతి జీవితం పెళ్లి తరువాత ఎలా మారింది.. ? భార్యాభర్తల మధ్య గొడవలకు కారణం ఎవరు.. ? ఓంకార్ నాయుడుకు శాంతి ఎలా బుద్ది చెప్తుంది.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

జయ జయ జయ జయహే సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యింది. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఓం శాంతి శాంతి శాంతిః తెలుగు నేటివిటీకి దగ్గరగా తీయడంతో కొత్త సినిమాను చూసినట్లే అనిపిస్తుంది. చేపల వ్యాపారం, గోదావరి సైడ్ యాస, భాష బాగా సెట్ అయ్యాయి. ఇక తరుణ్ భాస్కర్ - బ్రహ్మాజీ కామెడీ బాగా నవ్వులు పూయిస్తుందని తెలుస్తోంది. జై క్రిష్ మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా ఉంది. ట్రైలర్ తో సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చారు మేకర్స్. మరి ఈ సినిమాతో తరుణ్ భాస్కర్, ఈషా ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Updated Date - Jan 23 , 2026 | 08:09 PM