వాయిదాల్లేవ్.. అనుకున్న టైమ్‌కే ‘ఓజీ2’ స్టార్ట్!
ABN, Publish Date - Aug 12 , 2026 | 08:00 PM
సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కేవలం అంచనాలను మాత్రమే పెంచవు.. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే సునామీలను సృష్టిస్తాయి. అలాంటి ఒక కాంబినేషనే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్‌ది.
సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కేవలం అంచనాలను మాత్రమే పెంచవు.. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే సునామీలను సృష్టిస్తాయి. అలాంటి ఒక కాంబినేషనే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ (Sujeeth)ది. ‘ఓజీ’తో థియేటర్లలో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ఈ కాంబో.. ఇప్పుడు ‘ఓజీ 2’ (OG 2)తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోంది.
చాలా కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి వైలెంట్ అండ్ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ రోల్‌లో కనిపిస్తే థియేటర్లు ఎలా ఊగిపోతాయో ‘ఓజీ’ నిరూపించింది. పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్, ఆయన చూపించిన వింటేజ్ స్వాగ్, మ్యానరిజమ్స్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలిచాయి. దానికి తోడు యంగ్ డైరెక్టర్ సుజీత్ మేకింగ్, మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ థియేటర్లలో ప్రేక్షకులకు రొమాలు నిక్కబొడుచుకునే గూస్‌బంప్స్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చాయి. దీంతో ‘ఓజీ’ ఇచ్చిన కిక్‌తో ఈ మూవీ సీక్వెల్ ‘ఓజీ 2’ కోసం అభిమానులతో పాటు ప్రతి ఒక్క సినీ ప్రేమికుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానులు అనుకున్నట్లుగానే ‘ఓజీ 2’ అతి త్వరలోనే పట్టాలెక్కుతుందని మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ మధ్యలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు సర్జరీ కావడం, ఆయన కోలుకోవడానికి సమయం పడుతుండటంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో మొదలుకాదేమో అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు, ఈలోగా దర్శకుడు సుజీత్.. నేచురల్ స్టార్ నానితో ‘బ్లడీ రోమియో’ అనే మూవీని పట్టాలెక్కిస్తాడని సినీ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరిగింది. దీంతో ‘ఓజీ 2’ మరింత ఆలస్యం కావడం ఖాయమని, పవర్ స్టార్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు.
అయితే ఇప్పుడు పవర్ స్టార్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేసే ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ‘ఓజీ 2’ ప్లాన్‌లో ఎలాంటి మార్పులేదట. ముందనుకున్న ప్లాన్ ప్రకారమే ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుంచే షురూ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నవంబర్ నుంచి డేట్స్ కేటాయించడానికి, షూట్‌లో పాల్గొనడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. సో.. అన్నీ అనుకున్నట్లు కుదిరితే, ఈ ఏడాది చివర్లోనే ‘ఓజీ 2’ సెట్స్ పైకి వెళ్లిపోనుంది. అంటే పవన్ కళ్యాణ్-సుజీత్ కాంబో మళ్లీ మైండ్ బ్లోయింగ్ యాక్షన్ మోడ్‌లోకి దిగిపోతున్నారన్నమాట. పార్ట్-1తో సూపర్ హిట్ అందుకున్న పవన్ కళ్యాణ్ - సుజీత్ కాంబినేషన్, మరి ఈ సీక్వెల్ ‘ఓజీ 2’తో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. ఆల్రెడీ సుజీత్ పార్ట్‌కి సంబంధించి స్ర్కిఫ్ట్ లాక్ చేసినట్లుగా ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఇవి చదవండి:
రౌడీ వేర్ బ్రాండ్‌కు ఫ్యాన్స్‌గా డైరెక్టర్స్.. విజయ్ క్రేజ్ ఇది!
నటుడు అజింక్య దేవ్ చేతుల మీదుగా.. హీరోయిన్ జో శర్మకు నాఫా అవార్డ్
ఎన్టీఆర్‌కు విజయవంతంగా శస్త్రచికిత్స.. హెల్త్ బులిటెన్ విడుదల